Teachers Eligibility Test: ఉపాధ్యాయులకు పదోన్నతలను కల్పించాలి.. ఉత్తర్వులపై పునఃసమీక్షణ జరగాలి
సాక్షి ఎడ్యుకేషన్: టెట్‌తో సంబంధం లేకుండా ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించాలని టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ లచ్చిరాం డిమాండ్ చేశారు. గురువారం జిల్లాకేంద్రంలోని డైట్ కళాశాలలో జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టెట్ పేపర్–2లో ఉత్తీర్ణులైన వారికే పదోన్నతులు ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్షించాలని కోరారు. టెట్, ఉపాధ్యాయ నియామక అర్హత పరీక్ష మాత్రమేనని తెలిపారు.
Polytechnic Admissions: పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కోసం తేదీ విడుదల.. ఎప్పుడు?
పండిత, పీఈటీ పదోన్నతుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అప్‌గ్రేడ్ అయిన 10,479 పండిత, పీఈటీ పోస్టులకు ఈ షెడ్యూల్‌లోనే పదోన్నతులు కల్పించాలన్నారు. పీఎస్‌హెచ్‌ఎం పదోన్నతులకు చర్యలు తీసుకోవాలని, సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన 5,571 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేసి ఈ షెడ్యూల్‌లోనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థకు నష్టం చేయకూడదని సూచించారు.
Diet College: ఎన్ఐఆర్ఎఫ్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్ లో డైట్ కళాశాల..
ఇటీవల పీజీ హెచ్‌ఎంలుగా పదోన్నతులు పొందిన వారిని డీఈవో ప్రణీత సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.శ్రీకాంత్, ఎం.జలంధర్‌రెడ్డి, నాయకులు బేర దేవన్న, ఆర్.సుజాత, సురేశ్ వైద్య, రంగినేని రామారావు, భూపతిరెడ్డి, కుడ్మేత భీమ్‌రావ్, గండ్రత్ నారాయణ, వై.రాంరెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.