Polytechnic Admissions: పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కోసం తేదీ విడుదల.. ఎప్పుడు?
సాక్షి ఎడ్యుకేషన్: సాంకేతిక విద్యాశాఖ ఆదేశాల మేరకు వచ్చేనెల 3వ తేదీన పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నామని ప్రభుత్వ ఆదర్శ రెసిడెన్షియల్ (జీఎంఆర్) పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సుజాత తెలిపారు. పాడేరు కళాశాలకు సంభందించి డిప్లమో ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 60, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 60, మెకానికల్ ఇంజనీరింగ్ 60 సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. వీటిని స్పాట్ అడ్మిషన్ల విధానంలో భర్తీ చేస్తామన్నారు. టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులన్నారు. పాలిసెట్ రాయకపోయినా పర్వాలేదన్నారు.
Diet College: ఎన్ఐఆర్ఎఫ్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్ లో డైట్ కళాశాల..
ఒకవేళ పాలిసెట్ రాసి ర్యాంకు రాకపోయినా స్పాట్ అడ్మిషన్లలో అవకాశం కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు.ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో వచ్చేనెల 3వ తేదీన హాజరు కావాలని ఆమె కోరారు. స్పాట్ అడ్మిషన్‌లో సీటు పొందిన అభ్యర్థులు రూ.4,700 ఫీజును అదే రోజు చెల్లించి తరగతుల్లో చేరవచ్చని ఆమె పేర్కొన్నారు. పూర్తి వివరాలు పాలిటెక్నిక్ కళాశాల నోటీసుబోర్డులో పొందుపరిచామని ప్రిన్సిపాల్ వెల్లడించారు.