Skip to main content

TS TET 2023: టెట్‌ షెడ్యూల్‌... పరీక్ష విధానం ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ ఆగ‌ష్టు 1న‌ వెలువడింది. వచ్చే సెప్టెంబర్‌ 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా టెట్‌ నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య డైరెక్టరేట్‌ తెలిపింది.
TS TET 2023
టెట్‌ షెడ్యూల్‌... పరీక్ష విధానం ఇలా..

అర్హులైన అభ్యర్థులు ఆగష్టు 2 నుంచి 16 వ తేదీ వరకు  https://tstet.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. సెప్టెంబర్‌ 9వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. టెట్‌ ఫలితాలను సెప్టెంబర్‌ 27వ తేదీన వెల్లడిస్తారు. టెట్‌ ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ జీవితకాలం చెల్లుబాటులో ఉంటుంది. బీఈడీ, డీఎడ్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016, 17, 22 సంవత్సరాల్లో టెట్‌ నిర్వహించారు. తాజాగా నిర్వహించే దానితో కలుపుకుంటే ఇది నాలుగోసారి. అయితే 2017లో మాత్రమే టీచర్ల నియామక పరీక్ష నిర్వహించారు. ఇందులో 8,700 మంది అర్హత సాధిస్తే, 2020లో 8 వేలమందికి టీచర్‌ పోస్టులు ఇచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రంలో టెట్‌ అర్హత సాధించినవారు 4,19,030 మంది ఉన్నారు.  

చదవండి: TS TET 2023 Notification : బిగ్ బ్రేకింగ్‌... తెలంగాణ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌... డీఎస్సీపై క్లారిటీ..!

డీఎడ్‌ అభ్యర్థులకు పేపర్‌–1 

టెట్‌ రెండు పేపర్లుగా ఉంటుంది. డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ పూర్తి చేసినవారు పేపర్‌–1 రాసేందుకు అర్హులు. వీరి ఇంటర్‌లో 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే 45 శాతం) మార్కులు పొంది ఉండాలి.  

పేపర్‌–2 

బీఏ, బీకాం, బీఎస్సీ 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, బీసీలు 45 శాతం)తోపాటు బీఈడీ చేసిన అభ్యర్థులు పేపర్‌–2 రాయొచ్చు. వీరికి పేపర్‌–1 కూడా రాసేందుకు కూడా అవకాశం కల్పించారు.  

చదవండి: టెట్‌ - సిలబస్ | డీఎస్సీ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | 2022 ప్రివియస్‌ పేపర్స్

పరీక్ష విధానం ఇలా.. 

  • పేపర్‌–1లో 150 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ పెడగోగి, లాంగ్వేజి–1, లాంగ్వేజి–2 (ఇంగ్లిష్‌), మేథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ నుంచి ప్రతీవిభాగంలో 30 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. 
  • పేపర్‌–2లో చైల్డ్‌ డెవలప్‌మెంట్, పెడగోగీ(30), లాంగ్వేజ్‌–1 (30), లాంగ్వేజ్‌–2 (30), మ్యాథ్స్, సైన్స్‌ టీచర్లకు మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ టీచర్లకు సోషల్‌ సబ్జెక్ట్‌ 60 మార్కులకు ఉంటుంది. మొత్తం 150 మార్కులకు పేపర్‌ మల్టిపుల్‌ చాయిస్‌లోనే ఉంటుంది. ఎస్‌సీఆర్‌టీ సిలబస్‌ నుంచే ప్రశ్నలు వస్తాయి.  

అర్హత మార్కులెన్ని? 

150 మార్కుల ప్రశ్నపత్రంలో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 60 శాతం, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధిస్తే టెట్‌ అర్హులుగా పరిగణిస్తారు. దివ్యాంగులు 75 శాతం వైకల్యం కలిగి ఉండాలి.   

షెడ్యూల్‌ ఇలా... 

  • నేటి నుంచి టెట్‌ 
  • దరఖాస్తుల స్వీకరణ  
  • ఆగష్టు 16 వరకు 
  • దరఖాస్తులకు చివరి గడువు 
  • సెప్టెంబర్‌ 9 నుంచి 
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌  
  • పేపర్‌ –1 సెప్టెంబర్‌ 15న ఉదయం 9:30 నుంచి 12:00 గంటల వరకు 
  • పేపర్‌ –2 అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 
  • సెప్టెంబర్‌ 27న ఫలితాలు
Published date : 02 Aug 2023 01:25PM

Photo Stories