TS Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్.. అర్హతలు ఇవే..
పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు ఉచిత శిక్షణ కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసు శాఖలో ఉద్యోగం కోసం తీవ్రమైన పోటీ ఉంటోందని, ప్రతిసారీ లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిపారు. పోలీసు ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ, ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు.
TS Police Jobs: 17,003 పోలీసు ఉద్యోగాలు.. సిలబస్ ఇదే..
ఉచిత శిక్షణకు అర్హత సాధించే ప్రక్రియ ఇలా..
సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అయిదు జోన్లలో కలిపి ఇప్పటికే భారీ ఎత్తున పోలీస్ ఉద్యోగాల ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్‌కు నిరుద్యోగ యువత సుమారు 21 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. దరఖాస్తులు ఎక్కువగా రావడంతో ఉచిత శిక్షణకు అర్హత సాధించే ప్రక్రియలో భాగంగా మంగళవారం అయిదు జోన్ల పరిధిలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీన నగరంలోని ఐదు జోన్లలోని 36 కేంద్రాల్లో తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాల్లో ఈ పరీక్ష జరుగనుంది. అర్థమెటిక్, రీజనింగ్ 100 మార్కులు, జనరల్ స్టడీస్ 100 మార్కులకు దీనిని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, దరఖాస్తు చేసుకున్న వారు విధిగా హాజరుకావాలని కోరుతున్నారు.
ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే || Telangana Police Jobs 2022|| SI, Constable Jobs||Events
ఇవి తప్పనిసరి..
దరఖాస్తుదారులు హాల్ టికెట్ పొందేందుకు వారి ఫోన్లకు ఎస్సెమ్మెస్ ద్వారా లింక్ పంపించడంతో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ వెబ్‌సైట్, సిటీ కమిషనర్ వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియా వేదికలైన నగర పోలీస్ ఫేస్‌బుక్ పేజీ, ట్విట్టర్ సహా స్థానిక పోలీసుస్టేషన్‌ను నేరు గా సంప్రదించాలని పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే సమయంలో తమ వెంట హాల్ టికెట్ పాటు వాటర్ బాటిల్, మాస్కు తప్పనిసరిగా తెచ్చుకోవాలని తెలిపారు.
అత్యధికంగా పోలీస్ ఉద్యోగాలే..
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భర్తీకి అనుమతిచ్చిన వాటిలో అత్యధికంగా పోలీస్ ఉద్యోగాలే ఉన్నాయి. పోలీస్ విభాగానికి సంబంధించి 17,003 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
TS Police Jobs: ఈ నిబంధనల ప్రకారమే పోలీసు ఉద్యోగాలు భర్తీ..
పోలీసు శాఖ:
➤ కానిస్టేబుల్ సివిల్ (4965),
➤ఆర్మడ్ రిజర్వ్(4423),
➤టీఎస్‌ఎస్‌పీ(5704),
➤కానిస్టేబుల్ ఐటీ అండ్ సీ(262),
➤డ్రైవర్లు పిటీవో(100),
➤మెకానిక్ పీటీవో(21), సీపీఎల్(100),
➤సబ్ ఇన్‌స్పెక్టర్ సివిల్(415),
➤ఎస్‌ఐ ఏఆర్(69),
➤ఎస్‌ఐ టీఎస్‌ఎస్‌పీ(23),
➤ఎస్‌ఐ ఐటీ అండ్ సీ(23),
➤ఎస్‌ఐ పీటీవో(3),
➤ఎస్‌ఐ ఎస్‌ఏఅర్ సీపీఎల్(5)
➤ఏఎస్‌ఐ(ఎఫ్‌బీబీ–8),
➤సైంటిఫిక్ ఆఫీసర్(ఎఫ్‌ఎస్‌ఎల్–14),
➤సైంటిఫిక్ అసిస్టెంట్(ఎఫ్‌ఎస్‌ఎల్–32),
➤ల్యాబ్‌టెక్నిషీయన్ (ఎఫ్‌ఎస్‌ఎల్–17),
➤ల్యాబ్ అటెండెంట్(1),
➤ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్స్(390),
➤ఎస్‌ఐ ఎస్‌పీఎఫ్(12)
మొత్తం: 16,587
Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ కసితోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..
Competitive Exams: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో విజయం సాధ్యమా..? కాదా..?
డీజీపీ ఆఫీస్:
➤హెచ్‌ఓ (59),
➤జూనియర్ అసిస్టెంట్ ఎల్‌సీ(125),
➤జూనియర్ అసిస్టెంట్ టీఎస్‌ఎస్‌పీ(43),
➤సీనియర్ రిపోర్టర్(ఇంటెలిజెన్స్–2),
➤డీజీ ఎస్‌పీఎఫ్ (2)
మొత్తం: 231
ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే
జైళ్ల శాఖ:
➤ డిప్యూటీ జైలర్ (8),
➤ వార్డర్ (136),
➤వార్డర్ ఉమెన్ (10)
మొత్తం: 154
Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..