Breaking: ఏప్రిల్ 30న కానిస్టేబుల్ ఫైనల్ పరీక్ష... హాల్‌టికెట్లు విడుదల
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్షల హాల్ టికెట్లును తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) విడుదల చేసింది.
ఏప్రిల్ 28 అర్ధరాత్రి 12.00 గంటల లోపు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. పోలీస్ కానిస్టేబుల్(సివిల్, ఐటీ అండ్ సీవో) తుది పరీక్షలు ఏప్రిల్ 30న జరగనున్నాయి.
సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 వరకు జరగనుంది. ఐటీ అండ్ సీవో పోస్టులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. తమ హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోలేని అభ్యర్థులు support@tslprb.inకు ఈమెయిల్ పంపవచ్చని మండలి తెలిపింది.
చదవండి: విద్యార్థులకు ఉచితంగా బ్రేక్ ఫాస్ట్... సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
చదవండి: డాలర్ కోటకు బీటలు... మరో 10 ఏళ్లలో డాలర్ కథ ముగియబోతోందా...
చదవండి: ఒక పోస్టుకు 174 మంది పోటీ... ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు భారీగా అభ్యర్థులు
Published date : 24 Apr 2023 06:47PM