Skip to main content

TSLPRB: కానిస్టేబుల్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

జగిత్యాలక్రైం: పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల రాత పరీక్షలో అర్హులైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను అక్టోబ‌ర్ 12, 13 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలవరకు జిల్లాలోని ధరూర్‌ క్యాంప్‌ ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రంలో చేపడుతున్నట్లు ఎస్పీ ఎగ్గడి భాస్కర్‌ తెలిపారు.
TSLPRB
కానిస్టేబుల్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు సూచించిన విధంగా ఆన్‌లైన్‌లో అటెస్టేషన్‌ ఫారం తీసుకోవాలని, టీఎస్‌ఎల్‌పీఆర్బీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల లాగిన్‌లో వెబ్‌ టెంప్లేట్‌ రూపంలో ఈ ఫాం అందుబాటులో ఉంటాయని, వీటిని డిజిటల్‌గా పూర్తి చేసిన తర్వాత మూడు సెట్లు ప్రింట్‌ తీసుకుని అభ్యర్థులు సంతకాలు చేసి రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు అంటించాలని సూచించారు.

చదవండి: Telangana Constable Success Story : తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు.. అన్నావదిన సహాయంతోనే కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టానిలా..

జిరాక్స్‌లపై గెజిటెడ్‌ ఆఫీసర్‌తో సంతకం తీసుకోవాలన్నారు. 12న సివిల్‌, ఏఆర్‌, 13న టీఎస్‌ఎస్‌పీ, ఫైర్‌, ఎకై ్సజ్‌, ఐటీసీ, ట్రాన్స్‌పోర్టుకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ ఉంటుందన్నారు. అభ్యర్థులంతా సకాలంలో హాజరుకావాలని సూచించారు.

Published date : 10 Oct 2023 01:38PM

Photo Stories