Skip to main content

Certificates Verification : కేజీబీవీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌శాంతంగా స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న‌

ఏపీసీ నాగరాజు ఆధ్వర్యంలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ జరిగింది..
Online application process for KGBV part-time instructors and administrative positions  Certificates verification for KGBV teaching and non teaching candidates

అనంతపురం: సమగ్ర శిక్ష పరిధిలోని కేజీబీవీల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీలో భాగంగా శుక్రవారం సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఏపీసీ నాగరాజు ఆధ్వర్యంలో పరిశీలన ప్రక్రియ జరిగింది. టీచింగ్‌ పోస్టులతో పాటు పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు, వార్డెన్‌, అకౌంటెంట్‌ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. 1:5 రేషియో ప్రకారం 334 మంది అభ్యర్థులకు సమాచారం అందించారు. వీరిలో 269 మంది హాజరయ్యారు.

Agniveer Recruitment : న‌వంబ‌ర్ 10 నుంచి అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ!

రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన మెరిట్‌ జాబితా ఆధారంగా పరిశీలిస్తున్నారు. అయితే చాలామంది ఆన్‌లైన్‌లో ఇష్టానుసారంగా మార్కులు నమోదు చేశారు. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో మార్కులను దృష్టిలో ఉంచుకుని మెరిట్‌ జాబితా తయారు చేయనున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ పక్రియ పూర్తికానుంది. కాగా నాన్‌టీచింగ్‌ (టైప్‌–3,4) పోస్టులకు అధికారులపై ఒత్తిళ్లు షురూ అయ్యాయి. ప్రజాప్రతినిధుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తుండడంతో ఈ ప్రక్రియ తలనొప్పిగా మారింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 19 Oct 2024 11:21AM

Photo Stories