TSLPRB: పోలీసు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: యూనిఫాం సర్వీసెస్ కొలువుల భర్తీలో భాగంగా తుది రాత పరీక్షలో అర్హత సాధించిన వివిధ విభాగాల్లోని ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 14 నుంచి 26 వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తామని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు జూన్ 9న ఓ ప్రకటనలో తెలిపారు.
పోలీసు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీ ఇదే..
రాష్ట్రవ్యాప్తంగా 18 సెంటర్లలో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. ధ్రువ పత్రాల పరిశీలనకు సంబంధించి తేదీలు, కేంద్రాల వివరాలు జూన్ 11న ఉదయం 8 నుంచి 13వ తేదీ రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ‘www.tslprb.in’ వెబ్‌సైట్‌లో లాగిన్ ఐడీల ద్వారా ఇంటిమేషన్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.