TS SI Prelims Exam Hall ticket Download : ఎస్సై పరీక్ష.. హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..
ఆగస్టు 7వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష హాజరయ్యే అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు వారి ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి
ఈ హాల్‌టికెట్ పై..
డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌ను ప్రింట్ తీసుకోవాలని ఫొటోతో పాటు సెంటర్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 35 పట్టణ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ప్రింట్ తీసుకున్న హాల్‌టికెట్ మొదటి పేజీలో ఎడమ భాగంలో అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను అతికించాలని, అలా అతికించిన హాల్‌టికెట్‌తో వచ్చిన వారినే పరీక్ష కేంద్రానికి అనుమతిస్తామని స్పష్టంచేశారు. పరీక్ష నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినా అభ్యర్థి పరీక్ష చెల్లదని హెచ్చరించారు. పరీక్ష పత్రం ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్–ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 554 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 2,47,630 దరఖాస్తులు వచ్చాయి.
ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష విధానం :
- సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్ట్‌లకు నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్షను రెండు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు.
- అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి 100ప్రశ్నలు అడుగుతారు.
- జనరల్ స్టడీస్ నుంచి మరో 100 ప్రశ్నలు అడుగుతారు.
- మొత్తం మూడు గంటల వ్యవధిలో పెన్–పేపర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
- రెండు పోస్ట్‌లకు సంబంధించి కనీసం 30 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అదే విధంగా 20 శాతం నెగెటివ్ మార్కుల నిబంధన విధించారు.
- ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు పొందిన మార్కులు,దరఖాస్తుల సంఖ్య ఆధారంగా తదుపరి దశ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.
- ఇంటర్మీడియెట్ అర్హతగా నిర్వహించే కానిస్టేబుల్ ప్రిలిమ్స్, అదే విధంగా బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా జరిపే సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రిలిమ్స్ పరీక్షల్లో ప్రశ్నల క్లిష్టత ఆయా పోస్ట్‌ల స్థాయికి అనుగుణంగా ఉంటుంది.
- నెగెటివ్ మార్కింగ్ విధానంలో ప్రతి అయిదు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.
తెలంగాణ ఎస్ఐ,కానిస్టేబుల్ పరీక్షల బిట్‌బ్యాంక్ కోసం క్లిక్ చేయండి
ఇవి చదివితే..
- ఎస్‌ఐ పరీక్షలో.. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ ఉద్యమ దశలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షలో సైతం తెలంగాణ ప్రాధాన్యం గల అంశాలని క్లుప్తంగా పేర్కొన్నారు. వీటిలోనూ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమ దశల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
- హిస్టరీకి సంబంధించి భారత చరిత్రకు సంబంధించి ముఖ్యమైన ఘట్టాలు, చరిత్ర గతిని మార్చిన సంఘటనలు, భారత స్వాతంత్య్ర ఉద్యమంలోని ప్రధాన ఘట్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.
- జాగ్రఫీలో రాణించేందుకు భారత భౌగోళిక స్వరూపం, సహజ వనరులు, నదులు, సముద్ర తీర ప్రాంతాలు, అడవులు, పంటలు, సాగు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
- ఎకానమీలో కోర్ ఎకనామీ అంశాలతోపాటు సమకాలీన అంశాలు, దేశ ఆర్థిక రంగంలో అమలవుతున్న కొత్తవిధానాలపై స్పష్టత తెచ్చుకోవాలి.
- పాలిటీలో రాజ్యాంగం, రాజ్యాంగ రూపకర్తలు, రాజ్యంగంలోని ముఖ్యమైన అధికరణలు, ప్రకరణలు వంటి అంశాలతోపాటు తాజా రాజ్యాంగ సవరణలు, వాటి ఉద్దేశం, ప్రభావం వంటి అంశాలు తెలుసుకోవాలి.
- కరెంట్ అఫైర్స్‌లో.. జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న తాజా పరిణామాలు(ఉదా: క్రీడలు–విజేతలు, సదస్సులు, సమావేశాలు–తీర్మానాలు తదితర) గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా జాతీయ భద్రతకు సంబంధించి ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
- అర్థమెటిక్‌లోని ముఖ్యాంశాలుగా భావించే సగటులు, కసాగు, గసాభా, సంఖ్యలు, వర్గ మూలాలు, ఘన మూలాలు, నిష్పత్తులు, భాగస్వామ్యం, వయసులు, శాతాలు, లాభ–నష్టాలు, చక్ర వడ్డీ, సరళ వడ్డీ, కాలం–దూరం, కాలం–పని వంటి వాటిపై పట్టు సాధించాలి. మ్యాథమెటిక్స్‌లోని ప్రాథమిక అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మ్యాట్రిసెస్, సెట్స్–రిలేషన్స్‌ను ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయాలి.
- రీజనింగ్‌కు సంబంధించి.. నంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్స్, కోడింగ్–డీకోడింగ్, సీటింగ్ అరేంజ్‌మెంట్, బ్లడ్ రిలేషన్స్ వంటి వాటిపై పట్టు సాధించాలి. వెన్ డయాగ్రమ్స్, అసెంప్షన్ అండ్ రీజన్, ఆర్గ్యుమెంట్, సిలాజిజమ్, డేటా సఫిషియన్సీ విభాగాల్లో పట్టుతో వెర్బల్ రీజనింగ్‌లో రాణించే అవకాశం ఉంది. ఆడ్‌మన్ ఔట్, డైస్ అండ్ క్యూబ్స్, వెన్ డయాగ్రమ్స్‌లపై పట్టుతో నాన్ వెర్బల్ రీజనింగ్‌లో వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నైపుణ్యం లభిస్తుంది.
- తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్య అంశాల పరంగా.. ముల్కీ నిబంధనలు, శ్రీబాగ్ ఒడంబడిక, పెద్ద మనుషుల ఒప్పందం, గిర్‌గ్లానీ కమిషన్, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ నివేదికలను అధ్యయనం చేయాలి. అదే విధంగా తెలంగాణ మలి దశ ఉద్యమంలోని ముఖ్య ఘట్టాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. తెలంగాణ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, పంటలు, రవాణా సౌకర్యాలు, రాష్ట్రం మీదుగా వెళ్లే జాతీయ రహదారులు, నీటి పారుదల వ్యవస్థల గురించి బాగా చదవాలి. తెలంగాణ ఎకానమీ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి చేయూతనిచ్చే రంగాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. పంటలు– దిగుబడి, తాజా ఆర్థిక సర్వేలో ఈ ప్రాంతం గురించి పేర్కొన్న ముఖ్య అంశాలన్నింటిపై దృష్టి సారించాలి.
- ఇలా పునశ్చరణకు ప్రాధాన్యమిస్తూ.. ఆయా అంశాలకు లభించే వెయిటేజీ ఆధారంగా సబ్జెక్ట్ నైపుణ్యాలు కూడా సొంతం చేసుకుంటే..æ ప్రిలిమినరీ పరీక్షలో విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు.
చదవండి:
TS Police Exams: రాతపరీక్షలో నెగిటివ్ మార్కులు ఉన్నాయ్.. జాగ్రత్తగా రాయండిలా..
TS Police Jobs: దరఖాస్తు నుంచి తుది రాతపరీక్ష వరకు.. ఏవేవి ఎప్పుడంటే..?
రివిజన్‌కు ప్రాధాన్యం..
ప్రస్తుత సమయంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్ట్‌ల అభ్యర్థులు రివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజు సిలబస్ అంశాల ప్రిపరేషన్‌కు కనీసం ఆరు గంటలు, ఆ తర్వాత వాటి రివిజన్‌కు మరో గంట లేదా రెండు గంటలు కేటాయించాలి. పరీక్షకు పది రోజుల ముందు నుంచి పూర్తిగా రివిజన్‌పై దృష్టిపెట్టాలి.
TS Police Jobs: పోలీసు రాత పరీక్షలో.. ఏవైనా కష్టమైన ప్రశ్నలు వస్తే..
చదవండి: TS Police Recruitment: ప్రిలిమ్స్ పరీక్ష విధానం.. విజయం సాధించడానికి మార్గాలు..