Skip to main content

Telangana Inter Results: జూన్ 26వ తేదీన ఇంటర్‌ ఫలితాలు విడుద‌ల‌..? ఈ సారి ఫ‌లితాలు మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఇంటర్‌ ఫస్ట్, సెకండియర్‌ ఫలితాలు జూన్ 26వ తేదీన వెల్లడించే అవకాశాలున్నాయి.
TS Inter Results
TS Inter Results 2022 Date

ఈ మేర‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్‌ ఫలితాల వెల్లడికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నుంచి బోర్డు అధికారులు అనుమతి కోరినట్టు తెలిసింది. ఫలితాల ప్రకటనపై ట్రయల్‌ రన్‌ చేస్తున్న అధికారులు, ఈ ప్రక్రియ ఒకటి రెండురోజుల్లో పూర్తవుతుందనే ధీమాతో ఉన్నారు. తొలుత ఈ జూన్‌ 25న ఫలితాల వెల్లడిపై అధికారులు ఆసక్తి చూపారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు సమాచారం. మూల్యాంకనం తర్వాత మార్కులను కంప్యూటర్‌ ద్వారా ఫీడ్‌ చేశారు. ఈ క్రమంలో తప్పులు దొర్లినట్టు అధికారులు గమనించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సగటు ఫలితాల విశ్లేషణలో ఎక్కువ మొత్తంలో తేడా ఉన్నట్టు తెలియడంతో కలవరపడ్డారు. దీంతో మరోసారి సమగ్ర విశ్లేషణకు సిద్ధమయ్యారు. అయితే గ‌తంలో జ‌రిగిన అనుభ‌వాల‌ను దృష్టితో పెట్టుకొని.., ఈ సారి ఎటువంటి స‌మ‌స్య‌లు రాకుండా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. మే 6వ తేదీన‌ మొదలైన ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మే 24న ముగిసిన విష‌యం తెల్సిందే. తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేషన్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

How to Check TS Inter 1st Year 2022 Results:Results

➤ Visit results.sakshieducation.com or education.sakshi.com

➤ Click on TS Inter 1st year results - General / Vocational on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference.

How to Check TS Inter 2nd Year 2022 Results:

➤ Visit results.sakshieducation.com or education.sakshi.com

➤ Click on TS Inter 2nd year results - General / Vocational on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference.

ఆలస్యమైనా పర్వాలేదు.. ఈ త‌ప్పులు చేయ‌కండి: మంత్రి 

telangana education minister sabitha indra reddy


ఇంట‌ర్ ఫ‌లితాల‌పై వివరాలన్నీ తెలుసుకున్న మంత్రి ఆలస్యమైనా పర్వాలేదని, అన్నీ పరిశీలించిన తర్వాతే ఫలితాల విడుదలకు సిద్ధమవ్వాలని అధికారులకు సలహా ఇచ్చినట్టు తెలిసింది. గత ఏడాది కోవిడ్‌ నేపథ్యంలో ఫస్టియర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం అతి తక్కువగా (49%) రావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. విద్యార్థుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. దీంతో కనీస మార్కులతో అందరినీ పాస్‌ చేయాల్సి వచ్చింది.

ఇంటర్మీడియెట్ స్టడీ మెటీరియల్

ఉత్తీర్ణతలో తేడా వస్తే..
ఇప్పుడు కూడా కోవిడ్‌ తీవ్రత మధ్యే విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. ఇలాంటి సమయంలో పొరపాట్లు దొర్లి ఉత్తీర్ణతలో తేడా వస్తే విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగే అవకాశం ఉందని అధికారులకు మంత్రి సూచించినట్టు తెలిసింది. నిశితంగా పరిశీలించి అన్నీ బాగున్నాయని నిర్థారించుకుంటే జూన్‌ 26వ తేదీన ఫలితాల వెల్లడికి సిద్ధం కావాలని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ఫలితాల క్రాస్‌ చెక్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టిన అధికారులు జూన్ 24వ తేదీ లోగానే దీన్ని పూర్తి చేసుకుని, 25న మంత్రిని మరోసారి కలిసే అవకాశం ఉందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. జూన్ 26వ తేదీన ఫలితాల వెల్లడికి కృషి చేస్తున్నామని చెప్పారు. అలాగే ఈ సారి ఇంటర్ ప‌రీక్ష‌ల ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను 70 శాతం సిలబస్ నుంచి మాత్రమే ఇచ్చారు. దీంతో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇంటర్మీడియెట్ ప్రివియస్‌ పేపర్స్

ఈ సారి 9,07,396 మంది..
ఈ సారి ఇంట‌ర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,07,396 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంట‌ర్‌ సెకండియ‌ర్‌ విద్యార్థులు 4,42,768 మంది ఉన్నారు. అలాగే ఈ సారి 1,443 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.  25,530 మంది ఇన్విజిలేటర్లను, 150 మందితో సిట్టింగ్‌ స్క్వాడ్, మరో 75 మందితో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల‌ను ఏర్పాటు చేసి ప‌టిష్టంగా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. అలాగే ఇంట‌ర్ ఫస్టియర్ ప‌రీక్ష‌ల‌కు 4,64,626 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.

ఇంటర్మీడియెట్ మోడల్ పేపర్స్

తెలంగాణ 2022–23 ఇంట‌ర్‌ విద్యా సంవత్సర క్యాలెండర్‌..Inter Exams

ఇంటర్మీడియట్‌ 2022–23 విద్యా సంవత్సర క్యాలెండర్‌ను తెలంగాణ ఇంట‌ర్‌ బోర్డు మే 16న విడుదల చేసిన విష‌యం తెల్సిందే. జూన్ 15న ద్వితీయ సంవత్సరం విద్యార్థుల తరగతులు ప్రారంభించాలని పేర్కొంది. ఫస్టియర్ క్లాసులు జూలై 1 నుంచి మొదలవుతాయని, 2023 మార్చి 31తో విద్యా సంవత్సరం ముగుస్తుందని తెలిపింది. జూన్ నుంచి మార్చి వరకూ మొత్తం 304 దినాలుంటే, ఇందులో 83 సాధారణ, సంక్రాంతి, దసరా సెలవులు ఉంటాయని, ఇంటర్ కాలేజీలు 221 పనిదినాలు కొనసాగుతాయని షెడ్యూల్లో వివరించింది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ఈ షెడ్యూల్ను అనుసరించాలని బోర్డు పేర్కొంది.

Also Check:What after Inter/10+2...

2022–23 అకడమిక్ క్యాలెండర్ ఇదే..

సెకండియర్‌ మొదలు

15–6–22

ఫస్టియర్‌ ప్రారంభం

01–7–22

దసరా సెలవులు

2–10–22 నుంచి 9–10–22 వరకు

అర్ధ సంవత్సర పరీక్షలు

21–11–22 నుంచి 26–11–22 వరకు

సంక్రాంతి సెలవులు

13–1–23 నుంచి 15–1–23 వరకు

ప్రీ ఫైనల్‌ పరీక్షలు

6–2–23 నుంచి 13–2–23 వరకు

ప్రాక్టికల్‌ పరీక్షలు

20–2–23 నుంచి 6–3–23 వరరకు

థియరీ పరీక్షలు

15–3–23 నుంచి 4–4–23 వరకు

కాలేజీల చివరి పనిదినం

31–3–23

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

2023 మే చివరి వారం

కాలేజీల పునఃప్రారంభం

1–6–23

After Inter: ఇంటర్మీడియెట్‌ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..

Published date : 23 Jun 2022 03:10PM

Photo Stories