Skip to main content

Admissions: నచ్చిన కళాశాలకు మారొచ్చు!

హుజూర్‌నగర్‌ : ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవవత్సరం చదువుతున్న విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలకు మారేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
Admissions
నచ్చిన కళాశాలకు మారొచ్చు!

సమీప ప్రాంతాల్లో చదవాలనుకునే వారికి, తమ నిర్ణయాన్ని మార్చుకున్న వారికి ప్రభుత్వం ఈ వెసులు బాటు కల్పించింది. ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ కళాశాలకు, ప్రభుత్వ కళాశాల నుంచి ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందడానికి అవకాశం కల్పించారు. అక్టోబ‌ర్ 15 వరకు చివరి తేదీగా గడువు విధించారు.

చదవండి: UGC: సీటు రద్దు చేసుకుంటే ఫీజు వాపస్‌.. ఇన్ని రోజుల కంటే ముందు అయితే 100% రిఫండ్‌

జిల్లాలో మొత్తం 16,223 విద్యార్థులు

జిల్లాలో జూనియర్‌ కాలేజీలు మొత్తం 39 ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ కళాశాలలు 7 ఉండగా ప్రైవేట్‌ కళాశాలలు 32 ఉన్నాయి. వీటిల్లో 12,723 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ కశాలల్లో 3,118, ప్రైవేట్‌ కళాశాలల్లో 9,605 మంది విద్యార్థులు ఉన్నారు. అంతే కాకుండా కేజీబీవీలు, ఇతర గురుకుల కాలేజీల్లో దాదాపు 3,500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారు నచ్చిన కళాశాలకు మారేందుకు యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.

గ్రామాల నుంచి మండలాలకు, మండలాల నుంచి జిల్లాలోని పట్టణాలకు, జిల్లా కేంద్రానికి అనేక మంది విద్యార్థులు బస్సులు, ఆటోలతో పాటు ఇతర వాహనాలలో వస్తున్నారు. వీరికి తమకు సమీప ప్రాంతాల్లో చదువుకోవాలనే ఆలోచన ఉంటుంది. అలాంటి వారికి తాజా నిర్ణయంతో కొంత ఉపశమనం కలగనుంది.

చదవండి: TAFRC: అధికఫీజు వసూలుపై ఎఫ్‌ఆర్‌సీ కొరడా

యాజమాన్యాలు అంగీకరిస్తాయా?

ఇప్పటికే ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న వారు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరడానికి యాజమాన్యాలు అంగీకరిస్తాయా అనేది అర్థం కాని ప్రశ్నగా మారింది.

సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ కళాశాల్లో నాణ్య మైన విద్య అందించేందుకు యంత్రాంగం కృషి చేస్తోంది. నిపుణులైన అధ్యాపకులు విద్యాబోధన చేస్తున్నారు. తాజాగా కళాశాలలు మార్చు కునేందుకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. కాలేజీ మారాలనుకునే విద్యార్థులు ఈనెల 15వ తేదీ లోగా స్పందించాలి. సంబంధిత కాలేజీల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలి.
– జానపాటి కృష్ణయ్య, డీఐఈఓ, సూర్యాపేట

Published date : 11 Oct 2023 02:48PM

Photo Stories