Skip to main content

TS Inter Results: ఇంటర్‌ ఫలితాలు ఎప్పుడంటే?

సాక్షి, హైదరాబాద్‌: ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ పరీక్ష ఫలితాల వెల్లడికి అధికారులు సన్నా హాలు చేస్తున్నారు. మే 13వ తేదీలోగా రిజల్ట్స్‌ ప్రకటించాలని నిర్ణయించారు.
TS Inter Results
ఇంటర్‌ ఫలితాలు ఎప్పుడంటే?

ఇందుకు సంబంధించిన కసరత్తు గత రెండు రోజులుగా వేగం పుంజుకుంది. మూల్యాంకనం తర్వాత మార్కుల క్రోడీకరణ, డీ కోడింగ్‌ ప్రక్రియను త్వరగా ముగించారు. ఇప్పటికే పలు దఫాలుగా ట్రయల్‌ రన్‌ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన సాంకేతిక సమస్యలను పరిష్కరించారు. ఈ ప్రక్రియలో గత రెండు రోజులుగా ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, దీన్నిబట్టి ఫలితాల వెల్లడికి ఎలాంటి ఇబ్బంది లేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఫలితాల విడుదల తేదీ ఖరారు కాకున్నా, మే 13లోగా కచ్చితంగా వెల్లడిస్తామని ఇంటర్‌బోర్డ్‌ ముఖ్య అధికారి తెలిపారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలనే.. పలు దఫాలుగా ఫలితాల విశ్లేషణ, క్రోడీకరణ, కోడింగ్‌ విధానాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.  

చదవండి: Best Non-Engineering Courses After Inter: ఇంజనీరింగ్‌తోపాటు అనేక వినూత్న కోర్సులు !!

మంత్రి అనుమతి తర్వాత తేదీ ఖరారు.. 

ఫలితాల వెల్లడికి సంబంధించిన కసరత్తును మే 8 నాటికి పూర్తి చేయాలని ఉన్నతాధికారులు బోర్డు సిబ్బందిని ఆదేశించారు. మే 9న  మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఇంటర్‌ అధికారులు కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే రోజు పరీక్షల ఫలితాల వెల్లడి సమాచారాన్ని తెలియజేస్తారు. మంత్రి అనుమతి తర్వాత ఫలితాల వెల్లడి తేదీని ఖరారు చేస్తారని సమాచారం.

చదవండి: Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్‌ అర్హతగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుల వివరాలు ఇవే..

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23,901 మంది హాజరయ్యారు. ఇంటర్‌ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్‌ రెండో వారంలో పూర్తయింది. రెండో సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులు ఎంసెట్‌తో పాటు, అనేక పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ ఫలితాలు త్వరగా విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.

చదవండి: Job Opportunities After Class 12th MPC : ఎంపీసీతో.. కొలువులు ఇవిగో!

Published date : 06 May 2023 05:08PM

Photo Stories