Skip to main content

TSBIE: ఇంటర్‌ ప్రవేశాల గడువు తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరేందుకు మరింత గడువు ఇస్తున్నట్టు తెలంగాణ‌ ఇంటర్‌ బోర్డ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.
TSBIE extends last date for admissions into inter first year
ఇంటర్‌ ప్రవేశాల గడువు తేదీ ఇదే..

నవంబర్‌ 27 వరకూ విద్యార్థులు ప్రవేశాలు పొందవచ్చని వివరించింది. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ లాగిన్‌ నవంబర్‌ 21 నుంచి తిరిగి పనిచేస్తుందని పేర్కొంది. ఇంటర్‌లో చేరేందుకు ఇదే ఆఖరి అవకాశమని, ఇక మీదట తేదీని పొడిగించబోమని స్పష్టం చేసింది. 2022 జూలై నుంచే ఇంటర్‌ ప్రవేశాలు మొదలయ్యాయి.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

కళాశాలల్లో సిలబస్‌ సగానికి పైగా పూర్తయింది. కొన్ని ప్రైవేటు కళాశాలలకు ఇప్పటి వరకూ బోర్డ్‌ అనుమతి ఇవ్వలేదు. అగి్నమాపక శాఖ అనుమతితో పాటు మరికొన్ని అనుమతుల్లేవని వాటి అనుబంధ గు­ర్తింపును పెండింగ్‌లో ఉంచింది. కానీ ఆయా కళాశాలల్లో దాదాపు లక్ష మంది విద్యార్థులు ఇప్పటికే చేరారు. కేవలం వీరికోసమే ప్రవేశాల తేదీని పొడిగించినట్టు సమాచారం. 

చదవండి: What After Tenth: ఎన్నో అవకాశాలు... కోర్సు ఎంపికలో ఆసక్తి ప్రధానం

Published date : 21 Nov 2022 01:07PM

Photo Stories