TSBIE: ఇంటర్ పరీక్షల సిబ్బందిపై ప్రత్యేక దృషి
కొన్ని నెలల కిందట తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నవీన్ మిట్టల్ ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా పరీక్షల విభాగంలో సమూల మార్పులు తేవాలనే యోచనలో ఉన్నారు. రెండు రోజుల కిందట జరిగిన బోర్డు పాలక మండలి సమావేశంలోనూ ఈ అంశాన్ని ఆయన ప్రధానంగా చర్చించారు. మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించే పరీక్షల్లో తరచూ ఎదురవుతున్న విమర్శలు, ఆరోపణలపై మిట్టల్ ఓ నివేదిక రూపొందించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఏటా పరీక్షల కోసం నవంబర్, డిసెంబర్ నుంచే కసరత్తు చేయాల్సి ఉంటుంది.
చదవండి: ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్
ప్రశ్నపత్రాల రూపకల్పనకు నిపుణులను ఎంపిక చేయడం దగర్నుంచి ముద్రణ, జిల్లా కేంద్రాలకు చేరవేసే యంత్రాంగం కూర్పు అంతా రహస్యంగా జరుగుతుంది. అయితే బోర్డులో కొంతమంది వ్యక్తులతో బయట వ్యక్తులు మిలాఖత్ అవుతున్నారని, అంతిమంగా పరీక్ష కేంద్రాలు ఇష్టానుసారం ఇవ్వడం, ప్రశ్నపత్రాల్లోనూ ప్రైవేటు కాలేజీల ప్రమేయం ఉంటోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది పదవీ విరమణ పొందిన వ్యక్తులు, పైరవీ కారుల ప్రోద్బలంతో పరీక్షల విధానాన్ని గుప్పిట్లో పెట్టుకుంటున్న విమర్శలు కొన్నేళ్లుగా విని్పస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల విభాగంలో పనిచేస్తున్న వారి జాబితాను నవీన్ మిట్టల్ సేకరించినట్లు తెలిసింది. వీటిల్లో రిటైర్ అయినా పనిచేస్తున్న వారు, వారికి ప్రైవేటు కాలేజీలు, పైరవీకారులతో ఉన్న సంబంధాలేంటి? అనే సమాచారాన్ని అత్యంత రహస్యంగా సేకరించినట్లు సమాచారం. దీని ఆధారంగా కీలకమైన విధుల నుంచి వారి తప్పించాలని భావిస్తున్నారు. ప్రశ్నపత్రాల రూపకల్పనలో ప్రత్యేక విధానం అనుసరించనున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న సీనియర్లకు ఈ బాధ్యతలు అప్పగించనున్నారు.
చదవండి: Dual Degree Courses After Inter: డ్యూయల్ డిగ్రీతో.. యూజీ + పీజీ!