Admissions: కళాశాలల్లో తగ్గిన అడ్మిషన్లు
అందుకు కారణం గత విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలవడమే కారణం. జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఏటా మొదటి సంవత్సరంలో 2,500 నుంచి 3వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందేవారు. కానీ ఈ ఏడాది కేవలం 1,914 మందే చేరారు. తాండూరు, మర్పల్లి జూనియర్ కళాశాలల్లో జనరల్ కోర్సులతో పాటు ఒకేషనల్ కోర్సులు ఉన్నాయి.
తాండూరు, వికారాబాద్ జూనియర్ కళాశాల్లోని పలు కోర్సుల్లో ఉర్దూ మీడియం కూడా అందుబాటులో ఉంది. ఉచిత పాఠ్యపుస్తకాలు, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నా చాలా మంది విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు వెళ్లారు. సప్లిమెంటరీ తరువాతైనా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందేమోనని అధికారులు భావించారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
కళాశాల వారీగా అడ్మిషన్లు
నవాబుపేట్ జూనియర్ కళాశాలలో ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 36 మంది విద్యార్థులు చేరారు, వికారాబాద్ జూనియర్ కళాశాలలో 269 మంది, తాండూరులో 792 మంది, పెద్దేముల్‌లో 64 మంది, పరిగి జూనియర్ కళాశాలలో 197 మంది, మర్పల్లిలో 116 మంది, మోమిన్‌పేట్‌లో 85 మంది, దోమలో 122 మంది, కొడంగల్ జూనియర్ కళాశాలలో 233 మంది విద్యార్థులు మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు పొందారు.