TSBIE: ఇంటర్ ఆన్‌లైన్ మూల్యాంకన టెండర్ ఖరారు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ సమాధాన పత్రాలకు ఆన్‌లైన్ మూల్యాంకనం చేపట్టేందుకు బోర్డు నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది.
ఇందుకు సంబంధించిన టెండర్‌ను అధికారులు ఖరారు చేశారు. రెండోసారి నిర్వహించిన బిడ్డింగ్‌లో కోసైన్ అనే సంస్థ ఎల్–1గా నిలిచింది. బోర్డు నిర్ణయాన్ని ప్రభుత్వానికి పంపామని.. అక్కడి నుంచి పాలనాపరమైన అనుమతులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్
టెండర్ పొందిన సంస్థ అందించే సాఫ్ట్‌వేర్ సాయంతో అధికారులు ఇంటర్ సమాధాన పత్రాలను స్కాన్ చేసి మూల్యాంకనం చేపట్టే అధ్యాపక నిపుణులకు ఆన్‌లైన్ ద్వారా పంపనున్నారు. మూల్యాంకనం తర్వాత వారు ఆన్‌లైన్ ద్వారానే మార్కులు ఫీడ్ చేయనున్నారు. ఈ విధానం వల్ల మూల్యాంకన ప్రక్రియ త్వరగా జరగడంతోపాటు రీవాల్యూయేషన్ ప్రక్రియ కూడా అతితక్కువ సమయంలో పూర్తిచేసుకొనే వెసులుబాటు ఉంటుంది.
Published date : 24 Mar 2023 04:25PM