Skip to main content

Education: ఉన్నత లక్ష్యంతో చదివితే భవిష్యత్‌

మల్దకల్‌: ఉన్నత లక్ష్యంతో చదివితే ఉజ్వల భవిష్యత్‌కు అడుగు పడుతుందని.. ప్రతిభ కనబర్చి అటు తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు తేవాలని జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి హృదయరాజు అన్నారు.
Education
ఉన్నత లక్ష్యంతో చదివితే భవిష్యత్‌

ఆగ‌స్టు 10న‌ మల్దకల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జై నడిగడ్డ యువత ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సదరు యువకులు ప్రతిభ అవార్డులు అందజేసింది.

చదవండి: YS Jagan Mohan Reddy: సర్కారు బడి.. తల్లిదండ్రుల మమేకంతో..సరికొత్త ఒరవడి

ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన విద్యార్థులకు అందజేశారు. పదో తరగతి, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన మొత్తం 50మంది విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రమేష్‌లింగం, అధ్యాపకులు రామాంజనేయులుగౌడ్‌, నర్సింహులు, శివకుమార్‌, గోవర్దన్‌, భాగ్యలక్ష్మీ, జై నడిగడ్డ యువత వీరేష్‌, ఈరన్నగౌడు, వెంకటేష్‌, సత్యన్న, రమేష్‌, నర్సింహులుగౌడు, రంగస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు.

చదవండి: Education system: ప్రాథమిక విద్య మరింత పటిష్టం

Published date : 11 Aug 2023 04:29PM

Photo Stories