Intermediate: పరీక్షల నిర్వాహణ కష్టమైతే తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి
Sakshi Education
తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై బోర్డు తర్జనభర్జన పడుతోంది.
ఇందుకుగల సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు ఇటీవల సమావేశమైనప్పటికీ ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియలో ముందుకెళ్లాలా లేక కొంతకాలం ఆగాలా అనే విషయమై ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాసినట్లు అధికారులు చెబుతున్నారు. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వాహణ కష్టమైతే తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
చదవండి:
Teachers: దశలవారీగా ఇంగ్లిష్‌పై శిక్షణ
Jobs: పోస్టులకు అర్హులు లేకుంటే ఓపెన్ కేటగిరీలో భర్తీ.. దరఖాస్తులు స్వీకరణకి చివరి తేదీ ఇదే..
27 శాతం మంది పిల్లలకే స్మార్ట్ ఫోన్లు.. వివిధ రాష్ట్రాల్లో స్కూల్ పిల్లల వివరాలు
Published date : 08 Dec 2021 05:51PM