Teachers: దశలవారీగా ఇంగ్లిష్పై శిక్షణ

ఇందులో భాగంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు, మౌలిక సామర్థ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంపై పట్టు సాధించేందుకు ఏర్పాటు చేసిన ఆన్ లైన్ శిక్షణ కార్యక్రమాన్ని డిసెంబర్ 7న తన కార్యాలయం నుంచి మంత్రి ప్రారంభించారు. పిల్లల భవిష్యత్ దృష్ట్యా తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్ని కోరుకుంటున్నారని, దీన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ సంకలి్పంచారని చెప్పారు. ఇందులో భాగంగానే ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. టీచర్లు వృత్తిపరమైన సామర్థ్యం పెంచుకునేందుకు శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో ఆన్ లైన్ బోధనతో ఉపాధ్యాయులు చేసిన కృషిని మంత్రి అభినందించారు.
చదవండి:
Jobs: పోస్టులకు అర్హులు లేకుంటే ఓపెన్ కేటగిరీలో భర్తీ.. దరఖాస్తులు స్వీకరణకి చివరి తేదీ ఇదే..
27 శాతం మంది పిల్లలకే స్మార్ట్ ఫోన్లు.. వివిధ రాష్ట్రాల్లో స్కూల్ పిల్లల వివరాలు
Online Attendance: విద్యార్థుల హాజరు నమోదుపై ఆన్ లైన్ పర్యవేక్షణ