Intermediate: ఇంటర్ ఫస్టియర్ ఫలితాల వివరాలు
మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే తుదిదశకు చేరుకుందని, నవంబర్ 20 నాటికి పూర్తి కావొచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఫస్టియర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 4.12 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. గతేడాది కరోనా కారణంగా తరగతులు సరిగా జరగకపోవడంతో అధికారులు సిలబస్‌ను 70 శాతానికి కుదించారు. ఆన్ లైన్ బోధనలోనూ అనేక ఇబ్బందులు తలెత్తాయి. 2021 మార్చిలో ఇంటర్ పరీక్షలు జరపకుండానే అందరినీ సెకండియర్‌కు ప్రమోట్‌చేశారు. అయితే, రెండో ఏడాది కూడా పరీక్షలకు ఇబ్బంది తలెత్తితే, ఇంటర్ మార్కులను లెక్కించడం కష్టమని భావించిన అధికారులు ఆలస్యంగా ఫస్టియర్ పరీక్షలు నిర్వహించారు. ఈసారి ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విద్యార్థులకు ఆశాజనకంగా ఉండే వీలుందని ఇంటర్ బోర్డ్ అధికారులు అంటున్నారు.
చదవండి:
Intermediate: ఇంటర్ సిలబస్ 70 శాతమే
TS Inter: ఇంటర్ ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే అవకాశం..ఎందుకంటే..?
Intermediate: ఇంటర్ హాజరు మినహాయింపు ఫీజు గడువు చివరి తేదీ ఇదే