Intermediate: ఇంటర్ సిలబస్ 70 శాతమే
ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను నవంబర్ 9న బోర్డు ఉన్నతాధికారులు ఆమోదించారు. నవంబర్ 10న అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. రెండు సంవత్సరాలకూ ఇది వర్తిస్తుందని అధికారవర్గాలు తెలిపాయి. 30 శాతం సిలబస్‌ను ఎలా కుదించాలనే దానిపై అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఉత్తర్వులు వెలువడిన వెంటనే క్షేత్రస్థాయికి ఆ సిలబస్ వివరాలు పంపిస్తారు. ఇంటర్ విద్యా సంవత్సరం మొదలైనప్పటికీ ఎక్కువ శాతం ఆన్ లైన్ లోనే జరిగింది. అక్టోబర్ నుంచి ప్రత్యక్ష బోధన మొదలైంది. ఆన్ లైన్ బోధనలో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో సిలబస్ కుదిస్తామని ఇంతకాలం ఇంటర్ అధికారులు చెబుతూ వచ్చారు. కానీ అధికారికంగా ఉత్తర్వులు మాత్రం ఇవ్వలేదు. ఫిబ్రవరి, మార్చి నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. ఇప్పటికీ సిలబస్‌పై స్పష్టత రాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది ఫస్టియర్‌లో 30 శాతం సిలబస్ కుదించారు. కుదించిన చాప్టర్ల కొనసాగింపు సెకండియర్‌లో ఉన్నాయి. సదరు చాప్టర్లను ఫస్టియర్‌లో చదవకుండా సెకండియర్‌లో చదవడంతో అర్థం కాక విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు కొనసాగింపు చాప్టర్లను తీసివేస్తారా లేదా వేరే నిర్ణయం తీసుకుంటారా అనేది బోర్డు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో సిలబస్ కుదింపుపై సీబీఎస్‌ఈ రాష్ట్రాలకు సూచనలు చేసింది. 70 శాతం సిలబస్ అమలు మాత్రమే సరైనదని ఇంటర్ బోర్డు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. తాజాగా ప్రభుత్వం నుంచీ గ్రీన్ సిగ్నల్ రావడంతో సిలబస్ కుదింపు ఉత్తర్వులు ఇచ్చేందుకు బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
చదవండి:
PGCET: పీజీసెట్ మొదటి ర్యాంకర్లు వీరే..