Data Science: ఇంటర్ స్థాయిలో డేటా సైన్స్
ఇందుకు సంబంధించి కొన్ని కోర్సులనుప్రతిపాదించి, ఈ జాబితాను ప్రభుత్వ ఆమోదానికి పంపినట్టు తెలిసింది. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, డిగ్రీల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులకే విద్యార్థులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఏఐ మెషీన్ లెర్నింగ్ వంటి కోర్సులున్నాయి. ఈ కోర్సులకు ఇంటర్ స్థాయిలోనే ఫౌండేషన్ వేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఇటీవల ఓ అధ్యయనం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా నూతన విద్యా విధానంలో విభిన్న కోర్సుల కాంబినేషన్‌కు ప్రాధాన్యమిస్తోంది. ఈ తరహా ప్రయోగం ఉత్తర భారతంలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీసీ, బైపీపీ, హెచ్‌ఈసీ, సీఈసీ వంటి కోర్సులకే ఇంటర్‌లో విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. వీటి స్థానంలో అదనంగా సాంకేతిక విద్యాకోర్సుల పైలెట్ ప్రాజెక్టు ప్రయోగం చేయాలని ఇంటర్ బోర్డ్ ప్రతిపాదించినట్టు తెలిసింది. అయితే, వీటిని దీర్ఘకాలిక కోర్సులుగానా లేక స్వల్పకాలిక కోర్సులుగా కొనసాగించాలా అనే దానిపై స్పష్టత రాలేదు.
చదవండి: