Skip to main content

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పెరుగుతున్న ఆదరణ.. ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సు ప్రారంభం..

సాంకేతిక రంగంలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్.
మానవ ఆలోచనలకు అనుగుణంగా కంప్యూటర్ ఆధారిత యంత్ర వ్యవస్థ పనిచేసేలా చేయడమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఇప్పుడు ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఏఐలో స్పీచ్ రికగ్నిషన్, విజువల్ పర్సెప్షన్, లాజిక్ అండ్ డెసిషన్, మల్టీ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ లాంటి చాలా అంశాలుంటాయి. రోబోటిక్స్‌లోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం కీలకం.
  • కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఏఐ, మెషిన్ లెర్నింగ్) ఉంటుంది. ఈ కోర్సు లో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్ లాంగ్వేజ్‌లను నేర్పిస్తారు. జావా, ప్రొలాగ్, లిస్ప్, పైథాన్ వంటి కోర్సులు ఇందులో నేర్చుకోవచ్చు.
  • జాబ్ ప్రొఫైల్ : ఈ కోర్సును పూర్తిచేసిన అభ్య ర్థులకు డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, ప్రిన్సిపుల్ డేటాసైంటిస్ట్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్లుగా అవకాశాలు లభిస్తాయి.
  • వేతనాలు : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు పొందిన వారికి వార్షిక వేతనం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది.
ఇంకా చదవండి: part 6: ఇంజనీరింగ్‌లో ఈ కోర్సు చేస్తే బిజినెస్ టెక్నిక్స్ కూడా సొంతం చేసుకోవచ్చు.. తెలుసుకోండిలా?
Published date : 17 Nov 2020 04:46PM

Photo Stories