Skip to main content

Admissions: ఈ కళాశాలలో ప్రవేశాలకు పోటీ

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ప్రవేశాలు, ఫలితాల్లో ప్రైవేట్‌కు దీటుగా నిలుస్తున్నాయి.
Admissions
ఈ కళాశాలలో ప్రవేశాలకు పోటీ

ఏటా మెరుగైన ఉత్తీర్ణతతో విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తుండటంతో గవర్నమెంట్‌ కాలేజీల్లో సీట్లకు డిమాండ్‌ పెరుగుతోంది.

96శాతం ప్రవేశాలు పూర్తి..

జిల్లాలో మొత్తం 30 ప్రభుత్వ రంగ కళాశాలలు, 6 ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు కొన్నేళ్లుగా ప్రైవేట్‌ను మించి ఉత్తీర్ణత శాతం నమోదు చేస్తున్నాయి. అలాగే పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారు. కుమురంభీం జిల్లా వార్షిక ఫలితాల్లో మూడేళ్లుగా టాప్‌ త్రీలో నిలుస్తోంది. దీంతో చాలా మంది తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ కళాశాలలకు పంపేందుకు ఆసక్తి చూపుతున్నారు.

చదవండి: Gurukula College: ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం

11 గవర్నమెంట్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో 28,30 సీట్లు అందుబాటులో ఉండగా ఇప్పటికే 2,702 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఉచిత చదువు, పాఠ్యపుస్తకాలతోపాటు పరీక్షలకు కొన్నినెలల ముందు నుంచి స్థానిక ఎమ్మెల్యేలు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తున్నారు.

అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉండటం కలిసివస్తోంది. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. బోర్డు ఆదేశాలకు అనుగుణంగా సిలబస్‌ పూర్తి చేస్తున్నారు.

చదవండి: Distance Education: ఓపెన్‌ ఇంటర్‌కేంద్రం

మెరుగైన విద్య

జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య అందుతోంది. గతేడాది కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశా. అక్కడ నేర్చుకున్న విషయ పరిజ్ఞానంతోనే ఐఐటీలో సీటు వచ్చింది. అమరావతిలోని వెల్లూర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో సీఎస్‌ఈ బ్రాంచ్‌లో చేరా.
– పల్లవి, కాగజ్‌నగర్‌

అగ్రస్థానంలో జిల్లా

ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఐదు సంవత్సరాల నుంచి ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా అగ్రస్థానంలో ఉంటుంది. ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, నిష్ణాతులైన అధ్యాపకుల కృషితో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారు.
– శ్రీధర్‌సుమన్‌, డీఐఈవో


మూడేళ్లుగా ఇదే జోరు..

ప్రైవేట్‌, గురుకులాలు, కేజీబీవీలు పెరగడంతోపాటు విద్యార్థులు ఐటీఐ వంటి సాంకేతిక విద్య వైపు అడుగులు వేస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలు ఏటా తగ్గుతున్నాయి. కానీ కుమురంభీం జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మూడేళ్లుగా ప్రవేశాల జోరు కొనసాగుతోంది. 2021– 22 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 2,514 మంది విద్యార్థులు ప్రవేశాల తీసుకున్నారు.

2022– 23 విద్యాసంవత్సరంలో 2,560 మంది, 2023– 24 విద్యాసంవత్సరంలో 2,702 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశాల గడువు పొడిగించింది. అడ్మిషన్లకు మరో పదిరోజుల గడువు ఉండటంతో ప్రవేశాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రవేశాలతోపాటు కాలేజీలు ఫలితాల్లో మెరుగ్గా నిలుస్తున్నాయి.

2019– 20లో 72 శాతం, 2020– 21లో వంద శాతం, 2021– 22లో 76 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 2022– 23 సెకండియర్‌ ఫలితాల్లో 81 శాతంతో రాష్ట్రంలో ద్వితీయస్థానం కై వసం చేసుకుంది. ఆదివాసీ కుటుంబాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలు వరంగా మారాయి.

Published date : 12 Aug 2023 03:50PM

Photo Stories