Skip to main content

TSBIE: ‘ఆ జూనియర్‌ కాలేజీలకే అనుబంధ గుర్తింపు’

అగ్నిమాపక శాఖ ధ్రువీకరణతో పాటు అన్ని అనుమతులున్న జూనియర్‌ కళాశాలలకే అనుబంధ గుర్తింపు ఇస్తామని తేలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ స్పష్టం చేసింది.
TSBIE
‘ఆ జూనియర్‌ కాలేజీలకే అనుబంధ గుర్తింపు’

అదనపు తరగతుల నిర్వహణకు ప్రత్యేకంగా రుసుము చెల్లించి అనుమతి పొందాలంది. 2022–23కు ప్రైవేటు జూనియర్‌ కళాశాలల అఫిలియేషన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మార్చి 22న బోర్డు వెల్లడించింది. బోర్డ్‌ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే కళాశాలలు భవన యాజమాన్య హక్కు, అనుమతించిన బిల్డింగ్‌ ప్లాన్, ఫైర్‌ సేఫ్టీ సరి్టఫికెట్, శానిటరీ ధ్రువపత్రం, బోధన సిబ్బందికి సంబంధించిన సమగ్ర వివరాలతో పత్రాలను ఆన్ లైన్ ద్వారా సమరి్పంచాలని పేర్కొంది. ఏప్రిల్‌ 5 లోగా అపరాధ రుసుం లేకుండా, జరిమానాతో మే 17లోగా దరఖాస్తులు సమర్పించాలంది. 

చదవండి: 

​​​​​​​ఇంటర్‌ పరీక్షలు కొత్త టైంటేబుల్‌ ప్రకటించిన బోర్డు

ఆ అధికారాలు ఇంటర్ విద్య కమిషనర్ పరిధిలోకి

తప్పు చేసిన కాలేజీ మేనేజ్‌మెంట్‌లపై కఠినమైన చర్యలు

Published date : 23 Mar 2022 03:43PM

Photo Stories