Skip to main content

భూమి చలనం మన అనుభవంలోకి రాదు. ఎందుకు?

earth భూమి సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ తన చుట్టూ తాను గంటకు 1600కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తున్నా మనకు ఆ చలనం అనుభవంలోకి రాదు. కారణం భూమి సమవేగంతో చలిస్తూండడమే.

ఉదాహరణకు మనం సమవేగంతో ఒక సరళరేఖ వెంబడి పయనించే కారులో ఉన్నామనుకోండి (కానీ, నిజానికి ఏ వాహనమైనా ఈ విధంగా ఎక్కువ కాలం పయనించడం సాధ్యం కాదు) అప్పుడు మనలను ఎలాంటి బలం అటూ ఇటూ ఏ దిశలోనూ తోస్తున్నట్లు అనిపించదు. ఒక కారు నిశ్చలస్థితిలో ఉన్నా లేక గంటలకు 100 కిలోమీటర్ల సమవేగంతో ఒక సరళరేఖ వెంట పయనిస్తున్నా ఆ కారు చలన విషయంలో మనకు ఏ తేడా తెలియదు. కానీ సరళరేఖ వెంట పయనిస్తున్న అదేకారు వక్రమార్గంలో తటాలున మలుపు తిరిదంటే అందులో కూర్చున్న మన శరీరంపై ఒక బలం పనిచేస్తుంది. దాంతో మనం కారు పయనించే వక్రమార్గపు కేంద్రం నుంచి వెలుపలి వైపునకు కొంచెం ఒరుగుతాము. అలాగే కారు డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేస్తే మనం కూర్చున్నచోటులోనే కారు పయనించే మార్గదిశలోనే కొంచెం ముందుకు తూలుతాము. అంటే కారు పయనించే వేగంలో ఎలాంటి మార్పు లేకపోయినా, కారు వక్రమార్గంలో పయనించకపోయినా, కారులో ఉన్న మనపై ఎలాంటి బలం పనిచేయదు. దాంతో మనం ఎటూ జరగడం గానీ, తూలడంగానీ ఉండదు. మనం చలనం ఉన్నట్లు తెలిసినా, కానీ ఆ చలనం మన అనుభవంలోకి రాదు.

అదే విధంగా, భూమి చలనం ఉందని మనందరికీ తెలుసు. కానీ ఆ చలనం మన శరీరాల అనుభవంలోకి రాదు. దానికి కారణం భూమి ఒడిదుడుకులు లేకుండా నిరంతరం సమవేగంతో చలిస్తుండడమే.

భూమి సమవేగంతో చలిస్తున్నప్పటికీ అది సరళరేఖ వెంట కాకుండా వక్రమార్గంలో చలిస్తుంది. కాబట్టి భూమిమీద ఉండే మనం ఆ వక్రమార్గపు కేంద్రం నుంచి దూరంగా పడాలి. కానీ, అలా జరగడం లేదు. దీనికి కారణం, భూమి పరిమాణం. అది తిరిగే వక్రమార్గపు అవధి, భూమి ఎంత పెద్దదంటే, దాని పరిభ్రమణంలోని వంపు కారులో మాదిరిగా ఒక్కసారి తటాలున మారకుండా క్రమేపీ కొంచెం కొంచెంగా మారుతుంది. ఆ మార్పు చాలా వరకూ సరళరేఖ మార్గంగానే ఉంటుంది. దాంతో మనపై పనిచేసే బాహ్యబలం అత్యంత స్వల్పంగా ఉంటుంది. అంటే మనం సరళరేఖ వెంట పయనిస్తున్నట్లే ఉంటుంది. భూమి తన చుట్టూ తాను పరిభ్రమిస్తున్నా, మనం పరిభ్రమించడం.
Published date : 21 Aug 2013 02:34PM

Photo Stories