TS 10th Results : టెన్త్ ఉత్తీర్ణత తగ్గినా..కొంత బెటరే.. కానీ
2015 నుంచి ఇప్పటి వరకూ సగటు ఉత్తీర్ణత శాతం కన్నా ఎక్కువే వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2020తో పోలిస్తే 2 శాతం ఫలితాలు తగ్గినా.. కోవిడ్ వల్ల రెండేళ్లుగా జరిగిన నష్టంతో పోలిస్తే ఇది పెద్దగా తగ్గినట్టు కాదని అధికారులు అంటున్నారు. టెన్త్ సిలబస్‌ను 70 శాతానికి కుదించడం, 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లే ఇవ్వడంతో పాటు పరీక్షల విధానంలో కొంత సరళ విధానాలు అమలు చేయడం వల్లే ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ పదో తరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి
2015–2022 వరకూ టెన్త్ ఫలితాలు ఇలా..
సంవత్సరం పరీక్ష రాసిన వాళ్లు ఉత్తీర్ణులు ఫలితం (శాతంలో)
2015 5,13,473 3,98,253 77.56
2016 5,19,494 444808 85.62
2017 5,07,938 4,27,414 84.15
2018 5,01,732 4,20,307 83.77
2019 5,06,202 4,67,859 92.43
2020 5,08,960 5,08,953 99.99
2021 5,16,545 5,16,545 100
2022 5,03,579 4,53,201 90