Skip to main content

TS 10th Class Results: జూన్ 30 కల్లా టెన్త్‌ ఫలితాలు..? ఈ సారి ఫ‌లితాలు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ టెన్త్‌ పరీక్షల‌ ఫలితాలను జూన్ 30 నాటికి వెల్లడిస్తామని పరీక్షల విభాగం ఉన్నతాధికారి తెలిపారు.
TS 10th Class Result Date
TS 10th Class Results

ఫలితాల ప్రకటనపై ట్రయల్‌ రన్‌ చేస్తున్న అధికారులు, ఈ ప్రక్రియ త్వ‌ర‌లోనే పూర్తవుతుందనే ధీమాతో ఉన్నారు. ఫ‌లితాల వెల్లడికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నుంచి బోర్డు అధికారులు అనుమతి కోరినట్టు తెలిసింది.మే 23వ తేదీ నుంచి జూన్‌ ఒకటి వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరిగిన విష‌యం తెల్సిందే. ఈసారి 11 ప్రశ్నపత్రాలకు బదులు 6 మాత్రమే ఇచ్చారు. పరీక్షల సమయాన్ని కూడా పెంచారు. టెన్త్‌లో ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను 70 శాతం సిలబస్‌ మాత్రమే ఇచ్చారు. దీంతో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

How to check TS 10th Class 2022 Results:

Results


➤ Visit results.sakshieducation.com or education.sakshi.com

➤ Click on TS 10th Class 2022 results on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference

టెన్త్‌ ఫలితాల వెల్లడికి..
మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన తర్వాత, సాంకేతికపరమైన అన్ని విషయాలను త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నామని, డీకోడింగ్‌ తర్వాత వివిధ సబ్జెక్టుల మార్కుల క్రోడీకరణ జరిగిందని వివరించారు. వీటిని మరోసారి సమగ్రంగా పరిశీలించి తుది నిర్ణయానికి వస్తామని పేర్కొన్నారు. అనుకున్న సమయానికి ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

త‌ప్పులు దొర్లనివ్వొద్దు..: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

sabitha indra reddy


ఫ‌లితాల‌పై పూర్తి వివరాలన్నీ తెలుసుకున్న మంత్రి ఆలస్యమైనా పర్వాలేదని, అన్నీ పరిశీలించిన తర్వాతే ఫలితాల విడుదలకు సిద్ధమవ్వాలని అధికారులకు సలహా ఇచ్చినట్టు తెలిసింది.ఈ ఏడాది కూడా కోవిడ్‌ తీవ్రత మధ్యే విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇలాంటి సమయంలో పొరపాట్లు దొర్లి ఉత్తీర్ణతలో తేడా వస్తే విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగే అవకాశం ఉందని అధికారులకు మంత్రి సూచించినట్టు తెలిసింది. నిశితంగా పరిశీలించి అన్నీ బాగున్నాయని నిర్థారించుకుంటే ఫలితాల వెల్లడికి సిద్ధం కావాలని చెప్పినట్టు సమాచారం.

After 10+2/Inter: బైపీసీతో విస్తృతావకాశాలు!!

ఈ సారి పరీక్షలకు..TS 10th class Exams
ఈసారి మొత్తం 2,861 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 1,140 పాఠశాలల నుంచి 5,09,275 మంది హాజరయ్యారు. ఇందులో బాలురు 2,58,098 మంది, బాలికలు 2,51,177 మంది ఉన్నారు. ఈ ఏడాది పరీక్షలు రాసిన వారిలో 5,08,110 మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా, 1,165 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. 2,861 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, 33 వేల మంది ఇన్విజిలేటర్లను విధుల‌ను నిర్వ‌హించారు. అలాగే రాష్ట్ర కార్యాలయం నుంచి 4 ప్రత్యేక ఫ్లైయింగ్ స్వాడ్స్ బృందాలు, 144 ఫ్లైయింగ్ స్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేసింది.

After‌ Inter‌ BiPC: అవకాశాలు భేష్‌!

తెలంగాణలో ఈ సారి జ‌రిగిన ప‌రీక్ష‌ల తేదీలు ఇలా..

తేదీ పరీక్ష
23–5–22     మొదటి భాష
24–5–22 ద్వితీయ భాష
25–5–22 తృతీయ భాష
26–5–22 గణితం
27–5–22 జనరల్‌ సైన్స్‌
28–5–22 సోషల్‌ స్టడీస్‌
30–5–22 ఓఎస్సెస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ (సంస్కృతం, అరబిక్‌)
31–5–22 ఓఎస్సెస్సీ మెయిన్‌ (సంస్కృతం, అరబిక్‌)
01–6–22     ఎస్సెస్సీ ఒకేషనల్‌ కోర్సు

After Inter BiPC: వెటర్నరీ సైన్స్‌తో ఉద్యోగావకాశాలు.. బీవీఎస్సీతో డాక్టర్‌ హోదా పొందొచ్చు...

Published date : 23 Jun 2022 06:54PM

Photo Stories