Skip to main content

Telangana 10th Results 2023 : తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫలితాలు విడుదల.. ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి (Click Here)

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ప‌దో త‌ర‌గ‌త ఫ‌లితాలు విడుద‌ల చేశారు. ఎట్ట‌కేల‌కు విద్యార్థుల్లో ఉన్న‌ ఉత్కంఠకు తెర‌ప‌డింది. తెలంగాణ టెన్త్ ఫలితాలను మే 10వ తేదీన (బుధవారం) మ‌ద్యాహ్నం 12:00 గంట‌ల‌కు విడుద‌ల చేశారు.
TS 10th  Class Results 2023 Telugu News
TS 10th Class Results 2023 Released

 మొత్తం 86.60 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారు. బాలిక‌లు 88.53 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారు. బాలురు 84.68 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఉత్తీర్ణ‌త‌లో నిర్మ‌ల్ జిల్లా ఫ‌స్ట్ (99శాతం).. విక‌రాబాద్ లాస్ట్‌(86.60 శాతం) స్థానంలో ఉన్నాయి. ఈ ఫలితాలను చూడాలంటే https://results.sakshieducation.com లింక్‌ను క్లిక్ చేయండి.

How to check TS 10th Class Results 2023?

  • Visit https://results.sakshieducation.com/
  • Click on TS 10th class results link available on the home page
  • Enter your roll no. and click on submit
  • The results will be displayed on the screen
  • Download and save a copy of the mark sheet for further use.

☛➤ తెలంగాణ‌ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ ఫలితాలు-2023 కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త వివ‌రాలు ఇవే..

☛తెలంగాణ టెన్త్‌ ఫలితాల్లో 86 శాతం ఉత్తీర్ణ నమోదైంది.
☛బాలుర ఉత్తీర్ణత 84.68 శాతం
☛బాలికలు 88.53 శాతం ఉత్తీర్ణత
☛2,793 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత
☛నిర్మల్‌ జిల్లా 99 శాతంతో మొదటి స్తానంలో ఉండగా.. వికారాబాద్‌ జిల్లా 59.46 శాతంతో చివరి స్థానంలో ఉంది.
☛25 పాఠశాలలో జీరో శాతం ఉత్తీర్ణత
☛ప్రభుత్వ పాఠశాలలో 72.39 శాతం ఉత్తీర్ణత
☛తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 98.25 ఉత్తీర్ణత

ఫ‌లితాల కోసం 4,84,384 మంది విద్యార్థులు..

ts 10th class results news telugu 2023

రాష్ట్ర వ్యాప్తంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు ఈ ఏడాది రెగ్యుల‌ర్ విద్యార్థులు 4,86,194 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. వీరిలో 4,84,384 మంది హాజరయ్యారు. 1,809 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 11 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విష‌యం తెల్సిందే. పరీక్షలు జరిగిన నెలలోనే ఫలితాలను విడుద‌ల చేసింది. మే 9వ తేదీన ఇంటర్‌ ఫలితాలను రిలీజ్ చేసిన‌ విషయం తెల్సిందే. మరోనాడే టెన్త్‌ ఫలితాలను రిలీజ్ చేయ‌డం విశేషం.

గతేడాది తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పెద్ద ఎత్తున ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఏకంగా 90 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 87.61 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 92.45 గా ఉంది.

Published date : 10 May 2023 12:39PM

Photo Stories