Skip to main content

TS SSC Exams 2024: పదో తరగతి పరీక్షలు.. ఈసారి ఆ నిబంధన లేదు

Total examination centres   TS SSC Exams 2024   10th-generation speed exams announcement   Exam dates
TS SSC Exams 2024

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పదో తర గతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలకు 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో బాలురు 2,57,952 మంది. బాలికలు 2,50,433 మంది ఉ న్నారు. అధికారులు మొత్తం 2,676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అధికా రులు పరీక్షలు రాసే విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు, ప్రింటెడ్‌ నామినల్‌ రోల్స్‌ను పంపిణీ చేశారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద ఈ హాల్‌టికెట్లను పొందే వీలు కల్పించారు. అంతే కాకుండా ‘బీఎస్‌ఈ.తెలంగాణ.జీవోవీ.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌ ద్వారా కూడా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం ఉంది.

ఆ నిబంధన లేదు, 5 నిమిషాల వరకు అవకాశం
పరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని పరీక్షల విభాగం స్పష్టం చేసింది. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, మరో ఐదు నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తామని తెలిపింది. ఆ తర్వాత అనుమతించబోరని తెలిపింది.

Published date : 16 Mar 2024 11:41AM

Photo Stories