విద్యుత్ కోతతో ‘పది’ విద్యార్థుల ఇక్కట్లు
Sakshi Education
ఉండవెల్లి: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు వేసవి నేపథ్యంలో ఏ ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులు ఆదేశిస్తుండగా.. మరోవైపు మండల కేంద్రంలోని మూడు పరీక్ష కేంద్రాల్లో ఏప్రిల్ 10న విద్యుత్ అంతరాయం ఏర్పడి విద్యార్థులు చీకటి గదుల్లో ఇబ్బందులు పడ్డారు.
మండల కేంద్రంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి జంపర్ తెగి పోవడంతో జిల్లా పరిషత్, మైనార్టీ గురుకుల మరో పరీక్ష కేంద్రంలో ఉదయం 11 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు ఉక్కపోత, గదుల్లో చీకటి ఉండడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీసీ కెమెరాల రికార్డు సైతం నిలిచిపోయింది. విషయాన్ని ట్రాన్స్‌కో సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా.. మరో 20 నిమిషాల్లో మరమ్మతు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారని ఉపాధ్యాయులు తెలిపారు. ఇదిలాఉండగా, కేంద్రాలను ఫ్‌లైయింగ్ స్క్వాడ్స్ పరిశీలించారు.
చదవండి:
EAMCET 2023: ఎంసెట్‌కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..
TSPSC: ‘అడ్డదారి అభ్యర్థుల’ గుర్తింపే లక్ష్యం
Published date : 11 Apr 2023 05:27PM