Tenth Class: 2 రోజుల్లో టెన్త్ స్పాట్
రెండు రోజుల్లో మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఇప్పటికే సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాలకు తీసుకెళ్లి భద్రపరిచారు. ఈ ఏడాది 18 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రానికి సబ్జెక్టు నిపుణుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. మూల్యాంకనానికి స్కూల్ అసిస్టెంట్లను మాత్రమే తీసుకుంటున్నారు. ఈసారి పరీక్షల విధానంలో మార్పులు చేశారు. గతంలో 11 పేపర్లుండగా, ఈసారి ఆరు పేపర్లకే పరిమితం చేశారు. వీటన్నింటిపైనా మూల్యాంకనం చేసే టీచర్లకు అవగాహన కల్పించనున్నారు.
చదవండి: Tenth Class: డీబారైన విద్యార్థి ఊరట.. మిగతా పరీక్షలు రాసేందుకు అనుమతి
మూల్యాంకన కేంద్రాల వద్ద ఈసారి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల మొదటి రెండు రోజులు పేపర్ లీక్ ఘటనలను దృష్టిలో ఉంచుకుని, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. మూల్యాంకన కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. వీటిని జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షించనున్నారు. బయట వ్యక్తులతో సంబంధాలు లేకుండా, సమాచారం బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మూల్యాంకన కేంద్రం బాధ్యులకు క చ్చితమైన ఆదేశాలు పంపారు. మే నెల మొదటి వారంలో మార్కుల క్రోడీకరణ పూర్తి చేసి, మే మూడో వారం కల్లా ఫలితాలు వెల్లడించాలనే ఆలోచనలో ఉన్నట్టు ఓ అధికారి తెలిపారు.
పదో తరగతి పరీక్షల్లో ఏడుగురి డీబార్ పలువురు అధికారుల సస్పెన్షన్ ఏప్రిల్ 10న నిర్వహించిన పదోతరగతి సైన్స్ పరీక్షలో హనుమకొండ, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు డీబారయ్యారు. అలాగే, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు వర్ని కాలేజీ సెంటర్‌లో ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు. ధర్మసాగర్‌పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌ను విధుల నుంచి తొలగించారు.