Tenth Class: డీబారైన విద్యార్థి ఊరట.. మిగతా పరీక్షలు రాసేందుకు అనుమతి
విద్యాశాఖ అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దొండబోయిన హరీశ్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. జస్టిస్ కె.లక్ష్మణ్ ఏప్రిల్ 8న విచారణ చేపట్టి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 10 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు హరీశ్‌ను అనుమతించాలని విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది. అలాగే ప్రతివాదులైన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హనుమకొండ డీఈవో, ఎస్‌ఎస్‌సీ బోర్డు సెక్రటరీ, డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, కమలాపూర్ హెడ్మాష్టర్ కం చీఫ్ సూపరింటెండెంట్‌లకు నోటీసులు జారీ చేసింది.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
హరీశ్ నుంచి స్వాధీనం చేసుకున్న హాల్‌టికెట్‌ను తిరిగి అప్పగించాలని, 10, 11 తేదీల్లో జరగనున్న మిగిలిన రెండు పరీక్షలు రాసేందుకు అనుమతించాలని సూచించింది. అంతేగాక హిందీ, ఇంగ్లిష్ పేపర్ల పరీక్షలకు కూడా సప్లిమెంటరీకి అనుమతి ఇవ్వాల్సిదేనని చెప్పింది. ఈ ఆదేశాలు తాము వెలువరించే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 24కి వాయిదా వేసింది. బల్మూరికి విద్యార్థి తల్లిదండ్రుల కృతజ్ఞతలు తాము హైకోర్టులో పిటిషన్ వేసేందుకు అండగా నిలిచిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, కాంగ్రెస్ నేతలకు బాధిత విద్యార్థి హరీశ్ తల్లిదండ్రులు రాజు, సరిత కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్ ప్లానింగ్!
హరీశ్ తరఫున తాను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా, ఆ విద్యార్థి మిగతా పరీక్షలు రాసుకోవడానికి అనుమతినిచ్చిందని కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ ట్వీట్ చేశారు. కాగా, హరీశ్‌పై డీబార్ ఎత్తివేత, పరీక్షలను అనుమతించే విషయమై ఏప్రిల్ 8 సాయంత్రం వరకు తమకెలాంటి ఆదేశాలూ అందలేదని, ఉత్తర్వులు వస్తే ఆ మేరకు వ్యవహరిస్తామని హనుమకొండ డీఈఓ ఎండీ అబ్దుల్ హై ‘సాక్షి’కి తెలిపారు.
చదవండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!