TS Tenth Class Results: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల తేదీ ఇదే..
Sakshi Education
తెలంగాణ Tenth Class పబ్లిక్ పరీక్షల 2022 ఫలితాలు జూన్ 30న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల తేదీ ప్రకటన
జూన్ 30వ తేదీ న ఉదయం 11:30కు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి చేతుల మీదగా Tenth Class పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్షలకు హాజరైయిన విద్యార్ధులు www.sakshieducation.comలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 2022లో పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,09,275 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో 99 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. కరోనా కారణంగా 2022లో పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లను మాత్రమే నిర్వహించారు. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్ పెంచారు.