School Holidays: బడులకు వేసవి సెలవులు.. తిరిగి తెరుచుకోనున్న తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు అమలవుతాయి.
దీంతో అన్ని బడులూ జూన్ 11వరకు మూతపడి, 12న తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో చివరి దినమైన ఏప్రిల్ 24న పాఠశాలల్లో ఉపాధ్యాయులు పేరెంట్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈసారి జిల్లా స్థాయిలో కంప్యూటరీకరించి ఆన్‌లైన్‌లో ఉంచిన ప్రోగ్రెస్ కార్డులను ఉపాధ్యాయులు డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందించారు. 1–9 విద్యార్థుల అన్ని స్థాయిల పరీక్షల మార్కులు, ఏడాది పొడవునా విద్యార్థి పురోగతి, నడవడికతో కూడిన అనేక అంశాలను అందులో పొందుపరిచారు. విద్యార్థి లోపాలు, అధిగమించాల్సిన అంశాలు, వేసవి సెలవుల్లో నేర్చుకోవాల్సిన విషయాలను ప్రోగ్రెస్ కార్డుల్లో సూచించారు.
చదవండి:
Published date : 25 Apr 2023 03:27PM