Manchu Lakshmi: ‘స్మార్ట్’గా చదవాలి.. స్మార్ట్ క్లాస్‌రూమ్ ఏర్పాటు
Sakshi Education
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్‌రూంను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి, సినీనటి మంచు లక్ష్మి సూచించారు.
టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో జూన్ 25న కోతిరాంపూర్ (పోచంపల్లి) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన క్లాస్ రూంను వారు ప్రారంభించారు. స్మార్ట్ క్లాస్‌రూమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
జిల్లాలో 20 పాఠశాలల్లో ఇది అమలు చేస్తామని టీచ్ ఫర్ చేంజ్ వ్యవస్థాపక చైర్‌పర్సన్, మేనేజింగ్ ట్రస్టీ మంచు లక్ష్మి తెలిపారు. కలెక్టర్ ప్రోత్సాహం మరువలేనిదన్నారు. అనంతరం ఆమె విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.
Published date : 26 Jun 2024 03:15PM