10th Class Exams: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్.. పరీక్ష జరిగే ప్రాంతాల్లో ఇవి నిర్వహించవద్దు
Sakshi Education
ఖమ్మం క్రైం : జిల్లాలోని పదో తరగతి పరీక్ష కేంద్రాల సమీపంలో మార్చి 18 నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ మార్చి 17న ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంక్షలు అమల్లో ఉన్నందున పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించొద్దని, మైకులు, డీజేలు పెట్టొదని సూచించారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
పరీక్ష సమయంలో పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్ట చర్యలు తీసకుంటున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, పార్టీల, ప్రజా సంఘాల నాయకులు సహకరించాలని కోరారు.
Published date : 19 Mar 2024 10:50AM