Tenth Class: పరీక్షలు కేలండర్ విడుదల
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు మొదలై 15 రోజులు గడిచిన తర్వాత విద్యాశాఖ ఈ ఏడాది (2022–23) కేలండర్‌ను విడుదల చేసింది.
ఈ సంవత్సరం 230 రోజులు Schools నడుస్తాయి. 2023 ఏప్రిల్ 24 చివరి పనిదినంగా పేర్కొన్నారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు దసరా, డిసెంబర్ 22 నుంచి 28 వరకు క్రిస్‌మస్, 2023లో జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. పరీక్షల తర్వాత వేసవి సెలవులు 2023 ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు ఉంటాయి. స్కూల్‌లో ప్రతీ రోజు 5 నిమిషాలు యోగా, మెడిటేషన్ కొనసాగుతుందని అందులో పేర్కొన్నారు. 2023, జనవరి 10 నాటికి టెన్త్ సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఇదీ కాలపట్టిక
ఫార్మేటివ్ అసెస్‌మెంట్–1 |
21–07–22 |
ఫార్మేటివ్ అసెస్‌మెంట్–2 |
05–09–22 |
సమ్మెటివ్ అసెస్‌మెంట్–1 |
01–11–22 – 07–11–22 |
ఫార్మేటివ్ అసెస్‌మెంట్–3 |
21–12–22 |
ఫార్మేటివ్ అసెస్‌మెంట్–4 |
31–1–23 |
సమ్మెటివ్ అసెస్‌మెంట్–2 |
10–4–23 – 17–4–23 |
టెన్త్ ప్రీ ఫైనల్స్ |
28–2–23 లోపు |
టెన్త్ బోర్డ్ పరీక్షలు |
2023, మార్చి |
Published date : 30 Jun 2022 04:15PM