Dr C Venkatarao: సర్కారు బడిలోనే చదివి డాక్టరునయ్యా..
ఇప్పటిలా ఆ రోజుల్లో కనీస వసతులు కూడా ఉండేవి కావు. అయినా ఉపాధ్యాయులు అంకితభావంతో పాఠాలు చెప్పేవారు, విద్యార్థులు భయభక్తుల్లో చదువుకునే వాళ్లం. వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు.
ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలోనే చదివాను. ఎంబీబీఎస్‌లో సీటు రావడంతో వైద్య విద్యను కూడా పూర్తి చేశాను. అప్పట్లో మాకు గాంధీచౌక్ ప్రాంతంలో డి.లక్ష్మణ్ సార్ ఇంగ్లిష్ ప్రత్యేక క్లాసులు తీసుకునేవారు.
వీరితోపాటు మా పాఠశాలలో బోధించిన టి.నారాయణ, గోపాలరావు, లక్ష్మణచారి, నరసయ్య సార్ వంటి వారంతా మమ్మల్ని చాలా బాగా ప్రోత్సహించేవారు. మా తరగతిలో ఎప్పుడూ రెండవ స్థానంలో నిలిచేవాడిని.
చదువు ద్వారానే ఆర్థికంగా, సామాజికంగా ఉన్నతంగా ఎదగలుగుతామని మా ఉపాధ్యాయులు చెప్పేవారు. ఇప్పటికీ పాఠశాల తొలి రోజు ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది.
– డాక్టర్ సి.వెంకటరావు, ప్రముఖ సీనియర్ వైద్యులు, నిర్మల్