Girl Child Education: బాలికా విద్యను ప్రోత్సహించాలి
టీఎన్జీఓస్ భవన్‌లో మార్చి 6న మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలని, పాఠశాలలో లింగ వివక్షత లేకుండా చూడాలన్నారు. బాల బాలికలు సమానమనే విషయం ప్రతి ఇంటి నుంచి మొదలు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శులు జ్యోతి, విశాలాక్షి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్‌రావు, పద్మారావు, రెడ్డిపల్లి పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ ఫౌజియా తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Free Training: ఉచితంగా పలు విభాగాల్లో శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం
చదువుతోనే భవిష్యత్
టేక్మాల్(మెదక్): చదువుతోనే మంచి భవిష్యత్ ఉంటుందని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి బ్రహ్మాజీ అన్నారు. మార్చి 6న మండలంలోని దనూర ఉన్నత పాఠశాలలో ‘బేటి బచావో– బేటి పడావో’ కార్యక్రమం నిర్వహించా రు. ఈసందర్భంగా విద్యార్థులకు రిసోర్స్ పర్సన్ కొరపాటి సునీత అవగాహన కల్పించా రు. విద్యార్థినులు ఆపద సమయంలో ధైర్య ంతో ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అల్లాదుర్గం సీడీపీఓ హేమభార్గవి, మహిళా సాధికారిత కేంద్రం టీం డిస్ట్రిక్ కోఆర్డినేటర్ సంతోషి, జెండర్ స్పెషలిస్ట్ నాగమణి, కవిత, హెచ్‌ఎం వసంత తదితరులు పాల్గొన్నారు.