Schools: విద్యా దినోత్సవం.. ఇన్ని డిజిటల్ క్లాస్ రూమ్‌లు ప్రారంభం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 20న రాష్ట్ర విద్యా శాఖ విద్యాదినోత్సవం నిర్వహించనుంది.
విద్యా దినోత్సవం.. ఇన్ని డిజిటల్ క్లాస్ రూమ్‌లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు, గురుకుల పాఠశాలలు, వైద్య, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఫారెస్ట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ విద్యాసంస్థల్లో విద్యాదినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకోవడంతోపాటు ‘మన ఊరు–మన బడి’కార్యక్రమంలో భాగంగా నిర్మించిన పాఠశాల భవనాలను, ఇప్పటికే సిద్ధంగా ఉన్న పది వేల గ్రంథాలయాలను, 1,600 డిజిటల్ క్లాస్ రూమ్‌లను కూడా ప్రారంభిస్తారు.