Department of Education: ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయి బోధన..
Sakshi Education
నేలకొండపల్లి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించడమే కాక విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ శ్రీనివాసాచారి వెల్లడించారు.
ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, సింగారెడ్డిపాలెంలో పలు పాఠశాలలను నవంబర్ 10న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించడంతో పాటు తరగతి గదుల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం శ్రీనివాసాచారి మాట్లాడుతూ.. ఈ ఏడాది అనుకున్న సమయం కంటే ముందుగానే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించామని తెలిపారు.
చదవండి: Kambhampati Satyanarayana: నిరుద్యోగి వినూత్న ప్రచారం
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు ఈ ఏడాది 2.3 కోట్ల పుస్తకాలు సరఫరా చేశామని చెప్పారు. మెరుగైన ఫలితాలు నమోదయ్యేలా ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని, విద్యార్థులు వంద శాతం హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ బి.రాములు, హెచ్‌ఎం హరి శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Published date : 11 Nov 2023 02:45PM