Omicron: స్కూళ్ల మూసివేతపై స్పష్టత
Sakshi Education
స్కూళ్లలో ప్రస్తుతం కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉందన్నారు.
ఒమిక్రాన్ కారణంగా పాఠశాలల మూసివేతపై పుకార్లు నమ్మొద్దని తెలంగాణ విద్యశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. పాఠశాలల్లో కరోనా నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్కూళ్లలో ప్రస్తుతం కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉందన్నారు. ఇప్పటికే విద్యార్థులు రెండేళ్ల చదువును కోల్పోయారని గుర్తుచేశారు.
స్కూళ్లలో సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం స్కూళ్ల ప్రిన్సిపాల్స్ కూడా అవగాహన కల్పించాలని సూచించారు. స్కూళ్లలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
చదవండి:
World Bank: బడుల మూసివేతతో 10 లక్షల కోట్ల డాలర్లు నష్టం
Published date : 20 Dec 2021 03:48PM