School Holidays Calender Release: అకడమిక్ క్యాలెండర్ విడుదల.. పాఠశాలలు మొత్తం ఇన్ని రోజులు పనిచేయనున్నాయి!
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాలలు మొత్తం 229 రోజులు పనిచేయనున్నాయి. స్కూళ్లు జూన్ 12న ప్రారంభమై.. వచ్చే ఏడాది ఏప్రిల్ 24 చివరి వర్కింగ్ డే. ఇక, 2025 ఏప్రిల్ 24 నుంచి 2025 జూన్ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి.
ఈ ఏడాది దసరాకు అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు అంటే 13 రోజులపాటు పండుగ సెలవులు ఉంటాయి. డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు. ఇక, 2025 జనవరిలో సంక్రాంతి సెలవులు జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం ఆరు రోజులు ఉంటాయని విద్యా శాఖ వెల్లడించింది.
చదవండి: School Text Books: నూతన విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలు సిద్ధం..
మరోవైపు, 2025 జనవరి పదో తేదీ వరకు పదో తరగతి సిలబస్‌ను పూర్తి చేయనున్నారు. తర్వాత రివిజన్ క్లాసులు ఉంటాయి. ఫిబ్రవరి 28, 2025 వరకు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి సిలబస్ పూర్తి చేస్తారు.
ప్రతీ రోజూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండనున్నాయి. పదో తరగతి బోర్డు పరీక్షలను 2025 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొంది.
చదవండి: Corporate Institutions: కార్పొరేట్ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం..!
Tags
- School Holidays Calender Release
- School Education Department
- TS School Holidays
- Telangana School Holidays
- Tenth Class
- TS schools
- yoga classes
- Meditation Classes
- Telangana Education Department
- Summer vacation end date
- Telangana school schedule
- Hyderabad education news
- academic year Telangana
- telengana schools holidays list
- 2024-25 academic year Telangana
- Academic calendar 2024-25
- Hyderabad schools
- Telangana schools reopening
- publicholidays
- holidays
- SakshiEducationUpdates