Skip to main content

10th Class Students: జపాన్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ సైన్స్‌ ప్రదర్శనకు ఎంపిక

10th Class Students, Pothika Deepika

అలంపూర్‌ మాంటిస్సోరి పాఠశాలలో 2022–23 విద్యాసంవత్సరం 10వ తరగతి పూర్తి చేసిన పోతిక దీపిక జపాన్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ సైన్స్‌ ప్రదర్శనకు ఎంపికై ంది. ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సైన్స్‌ ప్రదర్శనలో ‘సైంటిఫిక్‌ బ్యాగ్‌’ ప్రదర్శనతో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే ప్రశంసలు అందుకున్నారు. సైంటిఫిక్‌ బ్యాగ్‌తో అకాల వర్షాల వల్ల ధాన్యం నష్టపోకుండా రైతులకు మేలు చేకూరుతుందని పాఠశాల ప్రిన్సిపాల్‌ నాగలక్ష్మి తెలిపారు. పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థిని దీపకతో పాటు గైడ్‌ టీచర్‌ మురళీకృష్ణమోహన్‌, సైన్స్‌ ఉపాధ్యాయ బృందాన్ని ప్రిన్సిపాల్‌, పాఠశాల డైరెక్టర్‌ కేఎన్‌వీ రవిప్రకాష్‌ సత్కరించి అభినందించారు.

చ‌ద‌వండి: School Holidays: న‌వంబ‌ర్ 27న పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే..

Published date : 06 Nov 2023 10:04AM

Photo Stories