School Holidays: నవంబర్ 27న పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే..
Sakshi Education
గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పలు పాఠశాలలు, కాలేజీలకు నవంబర్ 27వ తేదీన (సోమవారం) సెలవు ప్రకటించారు.
- గురు నానక్ జయంతి మొదటి సిక్కు గురువైన గురు నానక్ జన్మదినమును పండుగగా జరుపుకునే రోజు. ఈ పండుగను గురు నానక్ ప్రకాష్ ఉత్సవ్, గురు నానక్ దేవ్ జీ గుర్పురబ్ అని కూడా పిలుస్తారు. అత్యంత ఉన్నతమైన గురువులలో ఒకరైన గురు నానక్ దేవ్ సిక్కు మతం స్థాపకులు. సిక్కు మతంలో చాలా పవిత్రమైన పండుగలలో గురు నానక్ జయంతి ముఖ్యమైనది.
- కార్తీక శుద్ధ పౌర్ణమి, కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
చదవండి:
School Holidays: నవంబర్ 14న పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే..
Holidays List 2023: నవంబర్ లో 15 రోజులు సెలవులు.. సెలవు తేదీలు ఇవే..
School Holiday: నవంబర్ 30న పాఠశాలలకు సెలవు.. కారణం ఇదే..?
Published date : 06 Nov 2023 10:52AM