Skip to main content

School Holiday: నవంబర్ 30న‌ పాఠశాలల‌కు సెలవు.. కార‌ణం ఇదే..?

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.నవంబర్ 30న పోలింగ్ తేదీ ఖరారు చేయడంతో ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.కాగా తెలంగాణ ప్రభుత్వం పోలింగ్ జరిగే నవంబర్ 30 వతేదీని వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించింది.
School Holiday
నవంబర్ 30న‌ పాఠశాలల‌కు సెలవు.. కార‌ణం ఇదే..?

ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఆ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.నవంబర్ 29న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంస్థలు, కార్యాలయాలకు,పాఠశాలల‌కు  కూడా సెలవు ప్రకటించామని తెలిపారు. అలాగే డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగే కార్యాలయాలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

చదవండి: Telangana Assembly Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా

Published date : 26 Oct 2023 05:10PM

Photo Stories