Telangana Assembly Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా
నవంబర్ 30న తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మిజోరాంలో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మిజోరాంలో 8.52 లక్షల మంది ఓటర్లు, ఛత్తీస్‌గఢ్‌లో 2.03 కోట్ల మంది ఓటర్లు, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్ల ఓటర్లు, రాజస్థాన్‌లో 5.25 కోట్లు, తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలు, తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు, రాజస్థాన్‌లో 200 స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలు, మిజోరాం 40 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్
నోటిఫికేషన్ తేదీ: నవంబరు 3
నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ: నవంబరు 10
నామినేషన్ల పరిశీలన తేదీ: నవంబరు 13
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబరు 15
పోలింగ్ తేదీ: నవంబరు 30
ఓట్ల లెక్కింపు తేదీ: డిసెంబరు 3
మిజోరాం ఎన్నికల షెడ్యూల్
నోటిఫికేషన్ తేదీ: అక్టోబర్ 13
నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్ 20
నామినేషన్ల పరిశీలన తేదీ: అక్టోబర్ 21
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 23
పోలింగ్ తేదీ: నవంబరు 7
ఓట్ల లెక్కింపు తేదీ: డిసెంబరు 3
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల షెడ్యూల్
నోటిఫికేషన్ తేదీ: అక్టోబర్ 21
నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్ 30
నామినేషన్ల పరిశీలన తేదీ: అక్టోబర్ 31
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబరు 2
పోలింగ్ తేదీ: నవంబరు 17
ఓట్ల లెక్కింపు తేదీ: డిసెంబరు 3
మధ్యప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్
నోటిఫికేషన్ తేదీ: అక్టోబర్ 21
నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్ 30
నామినేషన్ల పరిశీలన తేదీ: అక్టోబర్ 31
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబరు 2
పోలింగ్ తేదీ: నవంబరు 17
ఓట్ల లెక్కింపు తేదీ: డిసెంబరు 3
రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్
నోటిఫికేషన్ తేదీ: అక్టోబర్ 30
నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ: నవంబరు 6
నామినేషన్ల పరిశీలన తేదీ: నవంబరు 7
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబరు 9
పోలింగ్ తేదీ: నవంబరు 25
ఓట్ల లెక్కింపు తేదీ: డిసెంబరు 3