Assembly Elections: ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. ఈసీ షెడ్యూల్ విడుదల
Sakshi Education
హర్యానా, జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 16వ తేదీ విడుదల చేసింది.
ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ దానికి సంబందించిన వివరాలను తెలిపారు.
ఆర్టికల్-370 రద్దు(2019లో), కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్ము కశ్మీర్‌లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2014 నుంచి ఇక్కడ ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయి. 110 అసెంబ్లీ స్థానాలకు మూడు విడుతల్లో పోలింగ్ జరగనుంది.
✦ సెప్టెంబర్ 18, 25వ తేదీ, అక్టోబర్ ఒకటో తేదీన మూడు విడతల్లో జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
▶ ఒకటో విడత సెప్టెంబర్ 18(24 స్థానాలు)
▶ రెండో విడత సెప్టెంబర్ 25(26 స్థానాలు)
▶ మూడో విడత అక్టోబర్ 1(40స్థానాలు)
▶ అక్టోబర్ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్.
✦ హర్యానాలో మొత్తం 90 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ ఒకటో తేదీన ఎన్నికలు, నాలుగో తేదీన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Published date : 16 Aug 2024 06:28PM