PM Awaas Yojana: పీఎంఏవై–జీ పథకం కింద గ్రామాల్లో మరో 2 కోట్ల ఇళ్లు
Sakshi Education
ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్(పీఎంఏవై–జీ) పథకం కింద గ్రామాల్లో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది.
ఆగస్టు 9వ తేదీ జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఈ పథకానికి సంబంధించిన పలు నిర్ణయాలు తీసుకున్నారు.
2024–25 నుంచి 2028–29 కాలానికి గ్రామాల్లో పీఎం ఆవాస్‌యోజన అమలుపై గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–పట్టణ(పీఎంఏవై–యూ) పథకం కింద రూ.2.30 లక్షల కోట్ల సాయం అందించనున్నారు.
క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్..
ఉద్యానరంగంలో చీడపీడలు తగ్గించడం, మెరుగైన విత్తనాలను సృష్టించడం, పూలు, పండ్ల దిగుబడి పెంచడమే లక్ష్యంగా క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్(సీపీపీ)కి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఉద్యానరంగంలో విప్లవాత్మక మార్పుల కోసం రూ.1,765.67 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
Published date : 10 Aug 2024 05:28PM